బీజేపీని దాటిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫాలోవర్స్
కేవలం ఒక జోక్‌గా, పొలిటికల్ సెటైర్‌గా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రయాణం దేశ వ్యాప్తంగా వినూత్న విప్లవంగా మారి దూసుకపోతుంది. గురువారం నాటికి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటి మందిని దాటి దూసుకెలుతుంది. ఇప్పటికే బీజేపీ(భారతీయ జనతా పార్టీ) ఫాలోవర్స్ సంఖ్యను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధిగమించి ముందుకెలుతుంది. దీంతో దేశంలో జెన్‌జీ రాజకీయం మొదలైందా? అన్న చర్చ జోరందుకుంది.
విధాత, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ఇటీవల చేసిన ‘బొద్దింకలు’ వ్యాఖ్యలకు నిరసనగా అభిజీత్ డిప్కే ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి దేశ ప్రజల్లో క్రమంగా ఆదరణ పెరిగిపోతుంది. కేవలం ఒక జోక్‌గా, పొలిటికల్ సెటైర్‌గా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ప్రయాణం దేశ వ్యాప్తంగా వినూత్న విప్లవంగా మారి దూసుకపోతుంది. గురువారం నాటికి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటి మందిని దాటి దూసుకెలుతుంది. ఇప్పటికే బీజేపీ(భారతీయ జనతా పార్టీ) ఫాలోవర్స్ సంఖ్యను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధిగమించి ముందుకెలుతుంది. దీంతో దేశంలో జెన్‌జీ రాజకీయం మొదలైందా? అన్న చర్చ జోరందుకుంది.
బొద్దింకల మాటల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ
మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ 30 ఏళ్ల అభిజీత్ డిప్కే అనే యువకుడు ఇన్ స్టాలో సెటైరికల్ గా కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఒక కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగులను.. పరాన్న జీవులు, బొద్దింకలతో సీజేఐ సూర్యకాంత్ పోల్చారు. అయితే ఆయన తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చారు. సూర్యకాంత్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అభిజీత్ డిప్కే ఇన్ స్టాలో ప్రకటన చేయడం..రోజురోజుకు ఆ పార్టీకి ఆన్ లైన్ లో ఆదరణ పెరిగిపోతుండటం గమనార్హం. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు కేవలం ఒక జోక్‌గా కాకుండా అధికార బీజేపీకి షాక్ గా, పొలిటికల్ సెటైర్‌గా కాకుండా ఫైటర్ గా మారిపోతుండం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపిన మనీశ్ సిసోడియా
కాక్రోచ్ పార్టీకి ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మద్దతు ప్రకటించారు. వ్యవస్థలోని బలమైన శక్తులకు (మొసళ్లకు) వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుల (బొద్దింకల) వైపే తాను ఉంటానని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీలు కూడా ఇప్పటికే తమ మద్దతు పలికారు. నిరుద్యోగంపై వ్యంగ్యంగా సాగుతున్న ఈ డిజిటల్ ఉద్యమంలో ఇప్పటికే కోటి మందికి పైగా ఫాలోవర్స్ చేరడం సంచలనంగా మారింది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram