Chinna Srishailam Yadav Fires On KTR : హైదరాబాద్ అంటేనే పహిల్వాన్
హైదరాబాద్ పహిల్వాన్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై చిన్న శ్రీశైలం తీవ్ర ఆగ్రహం. నవీన్ యాదవ్ గెలుపుతో కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అంటేనే పహిల్వాన్.. అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికి పహిల్వాన్, రౌడీయిజానికి తేడా ఏం తెలుసంటూ కేటీఆర్ పై జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం మండిపడ్డారు. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కుటుంబంపై రౌడీలంటూ కేటీఆర్ ప్రచారం చేయడంపై శ్రీశైలం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవీన్ యాదవ్ అత్త మాట్లాడుతూ కేసీఆర్ కు మా అన్న శ్రీశైలం యాదవ్ ఎంతో సహాయం చేశారు అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక మా అన్నపై రౌడీ ముద్ర వేశారు అని, మా అన్న కాదు.. అసలైన రౌడీలు వాళ్లేనంటూ మండిపడ్డారు. అన్నం పెట్టిన సోనియమ్మను బొమ్మ అని మాట్లాడిందే కేసీఆర్ కుటుంబం అని గుర్తు చేశారు. సోనియమ్మ తల్లి చెంతకు నవీన్ యాదవ్ చేరాడన్నారు. మేం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అని, కష్టానికి ఫలితం లభించింది.. నవీన్ యాదవ్ గెలవడం ఆనందంగా ఉందన్నారు
తన గెలుపుపై నవీన్ యాదవ్ మాట్లాడుతూ మనకు ఇక మంచి రోజులు వచ్చాయన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు నా పాదాభివందనాలు అని, సీఎం రేవంత్ అన్న పేరు నిలబెట్టే విధంగా పని చేస్తానన్నారు. నన్ను నమ్మి అవకాశం కల్పించిన హైకమాండ్ కి ధన్యవాదాలు అని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram