Cow Smuggling : పుష్ప సినిమా సీన్…ఆవుల స్మగ్లింగ్ లో స్టన్నింగ్

హైదరాబాద్ శివారులో పుష్ప సినిమా రేంజ్‌లో ఆవుల స్మగ్లింగ్! అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 70 గోవులతో ఉన్న లారీని గోరక్షకులు పట్టుకున్నారు. డబుల్ నెంబర్ ప్లేట్, ప్రత్యేక అరలతో నిందితుల స్కెచ్.

Cow Smuggling

విధాత, హైదారబాద్ : ఆవులు, ఎద్దుల అక్రమ రవాణాదారులు, గంజాయి, ఎర్రచందనం అక్రమరవాణా దారులు ఇటీవల పోలీసుల కళ్లగప్పి తప్పించుకునేందుకు పుష్ప సినిమా సీన్స్ ను ఫాలో అవుతున్నారు. తాజాగా పట్టుబడిన ఆవుల లారీలో ఆవులు కనిపించకుండా లారీలో రెండు అరలు ఏర్పాటు చేసిన దృశ్యం పుష్ప సినిమా సీన్స్ ను తలపించింది.

అబ్దుల్లాపూర్ మెట్ వద్ద 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు లారీ పైభాగంలో తాటి, కొబ్బరి మట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా గోవుల అక్రమ రవాణా దందా వెలుగుచూసింది. పట్టుబడిన గోవుల లారీని కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

Harish Rao : సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో..రైతులు చలిలో క్యూలైన్లలో
Raithu Bharosa payments| రైతుల ఖాతాల్లోకి “భరోసా” డబ్బులు..సంక్రాంతికే!

Latest News