Russia | ర‌ష్యాలో దారుణం.. యువ‌తిని మంచానికి కట్టేసి 1000 సార్లు లైంగిక‌దాడి

Russia | ఓ కామాంధుడు అతి కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న‌కు ప‌రిచ‌య‌మైన ఓ యువ‌తిని ఇంటికి పిలిచి.. ఓ గ‌దిలో బంధించాడు. ఆ త‌ర్వాత ఆమెను మంచానికి క‌ట్టేసి 1000 సార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ర‌ష్యాలో వెలుగు చూసింది. జ‌రిగింది ఇదీ.. 2009లో ర‌ష్యాలోని ఓ బ‌స్‌డిపోలో 19 ఏళ్ల యువ‌తి బ‌స్ కోసం వెయిట్ చేస్తుంది. అక్క‌డే ఉన్న వ్లాదిమిర్ చెస్కిడోవ్ ఆమెకు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ స్నేహితుల‌య్యారు. త‌న […]

Russia | ర‌ష్యాలో దారుణం.. యువ‌తిని మంచానికి కట్టేసి 1000 సార్లు లైంగిక‌దాడి

Russia | ఓ కామాంధుడు అతి కిరాత‌కంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న‌కు ప‌రిచ‌య‌మైన ఓ యువ‌తిని ఇంటికి పిలిచి.. ఓ గ‌దిలో బంధించాడు. ఆ త‌ర్వాత ఆమెను మంచానికి క‌ట్టేసి 1000 సార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ర‌ష్యాలో వెలుగు చూసింది.

జ‌రిగింది ఇదీ..

2009లో ర‌ష్యాలోని ఓ బ‌స్‌డిపోలో 19 ఏళ్ల యువ‌తి బ‌స్ కోసం వెయిట్ చేస్తుంది. అక్క‌డే ఉన్న వ్లాదిమిర్ చెస్కిడోవ్ ఆమెకు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ స్నేహితుల‌య్యారు. త‌న ఇంట్లో డ్రింక్స్ పార్టీ ఉంద‌ని చెప్పి, ఆమెను ఒక రోజు ఇంటికి ఆహ్వానించాడు.

చెస్కిడోవ్ ఆహ్వానించ‌డంతో ఆమె అత‌ని ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన మ‌రుక్ష‌ణ‌మే ఆమెను క‌త్తితో బెదిరించి, బెడ్‌రూమ్‌లో క‌ట్టేశాడు. ఇక ఆ అమ్మాయిని 14 ఏండ్ల పాటు ఆ గ‌దిలోనే బంధించాడు. కేవ‌లం వంట చేయ‌డానికి, ఇల్లు శుభ్రం చేయ‌డానికి మాత్ర‌మే గ‌దిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేది. అప్పుడు కూడా యువ‌తిని క‌నిపెడుతూ చెస్కిడోవ్ క‌త్తితో తిరిగేవాడని బాధితురాలు తెలిపింది.

1000 సార్లు లైంగిక‌దాడి..

ఈ 14 ఏండ్ల కాలంలో త‌న ప‌ట్ల ఓ సైకోలా చెస్కిడోవ్ ప్ర‌వ‌ర్తించాడ‌ని బాధితురాలు పేర్కొంది. దాదాపు 1000 సార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డి ఉంటాడ‌ని విల‌పించింది. ఈ నిందితుడికి త‌ల్లి కూడా స‌హ‌క‌రించేద‌ని, ఇద్ద‌రూ క‌లిసి క్రూరంగా హింసించేవార‌ని క‌న్నీరు పెట్టుకుంది బాధితురాలు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ నా నోరుకి టేప్ వేసేవాడు. గదిలో మంచానికి కట్టేసి వెళ్లిపోయేవాడు. ఎక్కడికీ పారిపోకుండా కత్తి పట్టుకుని వెంటే వచ్చే వాడని బాధితురాలు వెల్ల‌డించింది.

ఇలా త‌ప్పించుకుంది..

కొద్ది రోజుల క్రితం చెస్కిడోవ్ పీక‌ల దాకా మ‌ద్యం సేవించాడు. ఆ స‌మ‌యంలో వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటే.. అత‌ని త‌ల్లి అంబులెన్స్‌కు కాల్ చేసింది. ఆ హడావుడిలో ఇంటికి తాళం వేయ‌డం మ‌రిచిపోయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బాధిత యువ‌తి.. అక్క‌డ్నుంచి పారిపోయింది. త‌న సొంతూరికి వెళ్లిపోయి, చెల్లిని క‌లిసింది. దాదాపు 14 ఏండ్ల త‌ర్వాత కుటుంబ స‌భ్యుల‌ను కలుసుకోవ‌డంతో.. వారు భావోద్వేగానికి లోన‌య్యారు.

2011లో భార్య‌ను చంపేశాడు..

యువ‌తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. చెస్కిడోవ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. యువ‌తిపై తాను అత్యాచారం చేయ‌లేద‌ని, ఆమె చెప్పేవ‌న్నీ అవాస్త‌వాలు అని కోర్టుకు చెస్కిడోవ్ తెలిపాడు. ఆమెపై త‌న‌కెంతో ప్రేమ ఉంద‌న్నాడు. అయితే నిందితుడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. అభ్యంత‌ర‌క‌ర‌మైన వీడియో సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక సెల్లార్‌లో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీనిపై విచారించగా.. 2011లో చెస్కిడోవ్ ఓ మహిళను హత్య చేశాడని బాధితురాలు చెప్పింది. బాడీని డీ కంపోజ్ చేయడానికి సాయం చేయాలని బలవంతం చేశాడని వివరించింది. ఆ చనిపోయిన మహిళ మరెవరో కాదని, అతడి భార్యేనని వెల్లడించింది.