Bangladesh | ప్రపంచంలోనే అత్యధిక నదులు కలిగిన దేశం ఏది..? తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Bangladesh | ప్రపంచంలోనే అత్యధిక నదులు( Rivers ) కలిగిన దేశం పేరు వింటే ఆశ్చర్యపోక తప్పదు. అదేదో భారత్( India ), రష్యా( Russia ), చైనా( China ), అమెరికా( America ) అనుకుంటే పొరపాటే. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్( Bangladesh ).. ప్రపంచంలోనే అత్యధిక నదులు కలిగిన దేశంగా నిలిచింది.

Bangladesh | భారతదేశంలోని ప్రసిద్ధ నదులైన గంగా( ganga ), యమునా( Yamuna ), బ్రహ్మపుత్ర( Brahmaputra ) గురించి మీరు వినే ఉంటారు. ఇక ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధ నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా.. చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతాయి. ప్రతి నదికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇక పుష్కరాలు కూడా జరుగుతుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక నదులు ఉన్న దేశం గురించి శోధించినప్పుడు.. ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. అత్యధిక నదులు కలిగిన దేశంగా మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్( Bangladesh ) రికార్డు సృష్టించింది. నమ్మడానికి కష్టంగా ఉన్న ఉన్నా.. ఇది అక్షరాల నిజం.
బంగ్లాదేశ్‌లో దాదాపు 700 నదులు..!
బంగ్లాదేశ్‌లో దాదాపు 700 నదులు ప్రవహిస్తున్నాయి, అందుకే బంగ్లాదేశ్‌ను నదుల దేశం అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన నదులలో మహానంద, కర్ణఫులి, రైదక్, సుమ, తీస్తా, మేఘనా, బ్రహ్మపుత్ర, బాంగ్షి, అత్రి ఉన్నాయి. ఈ నదులకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్‌లో ప్రవహించే 57 అంతర్జాతీయ నదులలో 53 భారతదేశం నుండి, 3 మయన్మార్ నుండి ప్రవహిస్తున్నాయి. ఇక భారతదేశంలో చిన్న, పెద్ద నదుల మొత్తం సంఖ్య దాదాపు 200. ఈ సంఖ్య బంగ్లాదేశ్ కంటే చాలా తక్కువ. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక నదులు ఉన్న దేశంగా బంగ్లాదేశ్ పరిగణించబడింది.