Brazil Plane Crash | తెగిన గాలిపటంలా గింగిరాలు కొడుతూ నేల కూలిన విమానం.. 62 మంది దుర్మరణం..!
Brazil Plane Crash | దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ దుర్మరణం పాలయ్యారు.

Brazil Plane Crash : దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ దుర్మరణం పాలయ్యారు.
విమానం కాస్కావెల్ నుంచి గ్వారుల్హోస్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. కాస్కావెల్‌కు సమీపంలోని దట్టమైన అడవి మీదుగా వెళుతూ అకస్మాత్తుగా ఆ అడవిలోని ఓ గ్రామంలో కూలిపోయింది. విమానం కూలగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో విమానంలోని వారందరూ మరణించారని అధికారులు తెలిపారు.
విమానం ఓ ఇంటిపై కూలడంతో ఇళ్లు కూలిపోయిందని, కానీ అప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు. అయితే బ్రెజిల్ విమానయాన సంస్థ ఆ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
A plane with 62 passengers crashed in #Vinhedo, #SãoPaulo state, #Brazil, while en route from Cascavel to #Guarulhos airport, according to firefighters and airline #Voepass. #brazil #planecrash#Voepass #Vinhedo #Bresil #Crash@YvesPDB#Brasil
#Voepass pic.twitter.com/0lEQfIDUg2
— World Whisper (@world_Gar___) August 9, 2024