చైనా వరదల్లో పాముల కేంద్రాలు ధ్వసం…జనావాసాల్లోకి వేలాది పాములు!

చైనాలో మైసాక్ తుఫాన్ ప్రభావంంతో సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆ దేశ వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో తీవ్ర ఆస్తి నష్టాలు సంభవించగా..అనేక ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే వరదల ధాటికి గ్వాంగ్జీలో వాణిజ్య పాముల పెంపక కేంద్రాలలో బంధించిన వేలాది విషపూరిత పాములు వరదలలో సమీప గ్రామాలలోని జనావాసాల్లోకి కొట్టుకరావడంతో ప్రజలు ప్రాణాపాయంలో పడిపోయారు.

చైనాలో మైసాక్ తుఫాన్ ప్రభావంంతో సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆ దేశ వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో తీవ్ర ఆస్తి నష్టాలు సంభవించగా..అనేక ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే వరదల ధాటికి గ్వాంగ్జీలో పాముల పెంపక కేంద్రాలు ధ్వంసమవ్వడం అత్యంత ప్రమాదకరంగా మారింది. వాణిజ్య పాముల పెంపక కేంద్రాలలో బంధించిన వేలాది విషపూరిత పాములు వరదలలో సమీప గ్రామాలలోని జనావాసాల్లోకి స కొట్టుకరావడంతో ప్రజలు ప్రాణాపాయంలో పడిపోయారు.

ప్రపంచంలోనే ఇక్కడి అతిపెద్ద పాముల పెంపక కేంద్రాల నుంచి వేలాది పాములు వరదల ద్వారా జనావాసాల్లోకి రావడంతో ప్రజలు ప్రమాదంలో పడిపోయారు. తమ జనావాసాల్లోకి దూసుకొస్తున్న రకరకాల పాములను చూసి ఈ ప్రాంత ప్రజలు భీతిల్లిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరదలతో జనావాసాల్లోకి వచ్చిన పాములతో పలువురు కాటుకు గురికాగా.. ఓ మహిళ ప్రాణాలు సైతం కోల్పోయింది.

వైరల్ గా పాముల వీడియోలు

ప్రభుత్వం పాములు పెంపకం కేంద్రాల నుంచి జనావాసాల్లోకి కొట్టుకొచ్చిన పాములను గుర్తించి పట్టుకునేందుకు పెద్ద ఎత్తున స్నేక్ క్యాచర్స్ ను, ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించింది. వారు వరదల ద్వారా జనావాసాల్లోకి వచ్చిన పాములను పడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారాయి. స్థానికులు వలలతో పాములను పట్టుకోవడం, బురద నీటి నుంచి నాగుపాములు ప్రశాంతంగా తలలు బయటకు పెట్టడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

అక్కడ అత్యవసర పరిస్థితి

హెంగ్‌జౌ అంతటా వరద నీరు పెరగడంతో, హెంగ్‌జౌ మీడియా కన్వర్జెన్స్ సెంటర్ అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది. వరద కారణంగా పెంపకం కేంద్రాల నుంచి బయటపడిన చారల కట్లపాము, వెదురు వైపర్, నాగుపాము వంటి విషపూరిత పాములు నివాస భవనాలు, మెట్ల మార్గాలు, నదీ తీరాలు, ఇతర పొడి ప్రదేశాలలో ఆశ్రయం పొందే అవకాశం ఉందని ఆ మార్గదర్శకాలు హెచ్చరించాయి.హెంగ్‌జౌ మున్సిపల్ పీపుల్స్ హాస్పిటల్‌లో యాంటీవెనమ్ సరఫరాను పెంచడం, వైద్య సదుపాయాలను పెంచడం, వరద ప్రభావిత ప్రాంతాలలో పాముల గాలింపు- ప్రజల రక్షణకు పెట్రోలింగ్ చర్యలను పెంచడం ద్వారా అత్యవసర రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. డెంగ్‌వే గ్రామంలో 900నాగుపాములు కొట్టుకరావడంతో అక్కడ ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పాముల పెంపకం కేంద్రాలు..

ఆసియాలోని చైనా వంటి దేశాలలో వాణిజ్య పాముల పెంపకం ఒక ప్రధాన పరిశ్రమగా మారింది. పాముల మాంసం, చర్మాలు , ఔషధా తయారీ కోసం పాముల పెంపకానికి డిమాండ్ పెరిగింది. చైనాలో పాముల వ్యాపారం ద్వారా ఏటా సుమారు 12 మిలియన్ డాలర్లు వస్తాయని సమాచారం. అక్కడ 100కు పైగా వ్యవసాయ క్షేత్రాలలో దాదాపు 3 కోట్ల పాములను పెంచుతున్నారు. ఇక్కడ స్థానిక నివాసితుల కంటే పాముల సంఖ్య దాదాపు 3,000 రెట్లు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కల్గించకమానదు. రైతులు ఈ సరీసృపాలను రెస్టారెంట్ వంటకాల కోసం, అలాగే సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగించే ఉత్పత్తుల కోసం అమ్మి ఆదాయం గడిస్తున్నారు. చైనీస్ వైద్యంలో వాటిని కొన్నిసార్లు సూప్‌లలో తీసుకోవడం, ఔషధ వైన్‌లలో కలుపుకోవడం చేస్తుంటారు.

హెచ్చరికగా పాముల కేంద్రాల విధ్వంసం

అయితే పాముల పెంపకం కేంద్రాలు ప్రకృతి వైపరిత్య సమయాలలో ఎంత ప్రమాదకరంగా మారుతాయో ప్రస్తుతం చైనాలో నెలకొన్న వరదల బీభత్సం హెచ్చరిస్తుంది. వరదలలో కొట్టుకొచ్చిన పాములు పొడి స్థలాల కోసం వెతుకులాడే క్రమంలో భవనాల్లోకి ప్రవేశించడం, తలుపులు, గోడలు, డ్రెయిన్‌పైపుల చుట్టూ ఉన్న ఖాళీలలోకి, ఫర్నిచర్ కింద చేరవచ్చని, అలాగే నీటిపై తేలుతున్న చెత్తలో ఉండవచ్చని..అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పందులు, జూ పార్కుల కేంద్రాలకు కూడా తీవ్ర నష్టం

గ్వాంగ్జీలో తీవ్ర తుఫాన్ వరదల కారణంగా జలాశయాలు తెగిపోవడం లేదా ఉప్పొంగిపోవడంతో పట్టణాలు, నగరాల్లోకి వరద నీరు ప్రవహించింది. ఆరుగురు మరణించినట్లు నివేదికలు రాగా, సుమారు 1,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్వాంగ్జీ ప్రాంతీయ ప్రచార కార్యాలయం ప్రకారం, సహాయక చర్యలలో 8,000 మందికి పైగా సిబ్బందిని, సుమారు 5,700 పడవలను మోహరించారు.

ఈ తుఫానుల వల్ల వాణిజ్య పాముల కేంద్రాలతో పాటు బల్లులు, పందుల ఫారాలు మునిగిపోయాయి. వేలాది పందులు, పాములు గల్లంతయ్యాయి. కలప ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి, మల్లె తోటలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా గ్వాంగ్జీ ప్రాంతంలోని ఒక జంతు ప్రదర్శనశాల నుండి చిన్న పందులు, జీబ్రాలతో సహా కనీసం వివిధ రకాల 100కు పైగా జంతువులు తప్పించుకున్నాయి.

 

Latest News