కోవిడ్(కరోనా) వైరస్ సహజంగా విస్తరించిన మహమ్మరినా?..లేక మనిషి పరిశోధనల వికటిత ఫలితమా? అన్న సందేహాలు ఇప్పటికి వినిపిస్తునే ఉన్నాయి. కోవిడ్ వైరస్ చైనా వ్యూహాన్ ల్యాబ్ లీకేజీ రేపిన విధ్వంసంగా అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కోవిడ్ వచ్చి వెళ్లిన ఐదేళ్ల తర్వాత ఈ వైరస్ వ్యాప్తి వెనుక గుట్టుకు సంబంధించి తాజాగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తన చివరి రోజున తులసి గబ్బార్డ్ కొన్ని కీలక డాక్యుమెంట్లు విడుదల చేశారు. ఇందులో ఆమె కోవిడ్ వైరస్ మానవ నిర్వాకమేనని…వ్యూహాన్ ల్యాబ్ లీకేజీ సృష్టించిన మహమ్మరి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కోట్లాదిమంది ప్రాణాలు తీసిన ల్యాబ్ రీసెర్చ్ !?
కొవిడ్ మూలాలు, వ్యూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్, అమెరికా నిధులతో పరిశోధనలపై అమెరికా ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా వైరస్ విస్తరణపై తలెత్తిన ప్రశ్నలనుతొక్కిపెట్టిందని తులసి ఆరోపించారు. వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో గబ్బిలాల కరోనా వైరస్‌లపై ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్’ పరిశోధన కోసం డాక్టర్ ఫౌచీ అమెరికా పన్ను చెల్లింపుదారుల మిలియన్ల డాలర్ల నిధులను మళ్లించారని తులసి ప్రధానంగా ఆరోపించింది. ఈ రీసెర్చ్ ల్యాబ్ నుంచే కోవిడ్-19కు కారణమైన వైరస్ లీక్ అయ్యిందని, ఈ పరిశోధన వల్లే ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది చనిపోయారని తులసి గబ్బార్డ్ వాదించారు.
మరోసారి కోవిడ్ విస్తరణపై రచ్చ
దీంతో ఐదేళ్ల తర్వాత కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎలా జరిగిందన్న అంశంపై మరోసారి రచ్చ మొదలైంది. కోవిడ్ సమయంలో ప్రచారం జరిగినట్లుగానే..నిజంగానే వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందా? అన్న సందేహాలు మళ్లీ బలపడుతున్నాయి. ల్యాబ్ లీక్‌కు సంబంధించిన ప్రశ్నలను అణచివేయడానికి డాక్టర్ ఫౌచీ నిఘా అధికారులతో కలిసి పనిచేశారని, 2024లో కాంగ్రెస్ ముందు ఆయన ఇచ్చిన సాక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఆమె కీలక డాక్యుమెంట్లను చూపిస్తున్నారు. తులసి గబ్బార్డ్ చేసిన తాజా ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
భిన్న వాదనలు..
కోవిడ్ వైరస్ విస్తరణపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో చాల వరకు గబ్బిలాలు, పాంగోలిన్లు, ఇతర క్షీరద జంతువుల నుంచి విస్తరించి ఉండవచ్చని, ప్రధానంగా వుహాన్‌లోని హువానన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌లో అమ్మిన జంతువుల నుండి ఈ వైరస్ వచ్చిందనే వాదనను బలపరిచాయి. మరికొందరు మాత్ర వ్యూహన్ ల్యాబ్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తులసి గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాలతో రీసెర్చ్ కోవిడ్ వైరస్ ల్యాబ్ లికేజీ పరిణామమేనన్న వాదనకు ఊతమిస్తుండటం చర్చనీయాంశమైంది.
కోవిడ్ మరణాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక మేరకు కోవిడ్ తో ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా దాదాపు 7.1 మిలియన్లకు (71 లక్షలకు) చనిపోయారని తేల్చగా…ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 మిలియన్ల నుండి 20 మిలియన్ల వరకు (1.5 కోట్ల నుండి 3 కోట్ల వరకు) ప్రాణాలు కోల్పోయారని అంచనా వేసింది. భారత్ లో అధికారికంగా 5లక్షల మంది..అనధికారింగా 40లక్షల మంది కోవిడ్ ప్రభావిత వైరస్ తో మరణించినట్లుగా పలు నివేదికలు అంచనాలు వెల్లడించడం గమనార్హం.
Yesterday was my final day as Director of National Intelligence. I declassified and released never-before-seen documents exposing the truth about Fauci directing millions of US taxpayer dollars to fund dangerous gain-of-function research at the Wuhan lab, worked with the… pic.twitter.com/ExZVLNwvMf
— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) June 20, 2026
