చంద్రునిపై ట్రంప్ టవర్.. ఎప్పటిలోగా.. నెటిజన్ల రియాక్షనేంటి?
చంద్రునిపై ట్రంప్ టవర్! అదిరిపోయే ఏఐ చిత్రాన్ని షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్. దీంతో ట్రంప్ ఈ చిత్రాన్ని ఎందుకు పెట్టారు? ఎప్పటిలోగా చంద్రునిపై స్థిర ఆవాసాలకు మార్గం సుగమం అవుతుంది అన్న చర్చలు జోరందుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఇదే క్రమంలో తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ఒక విచిత్రమై పోస్ట్ చేశారు. చంద్రునిపై స్వర్ణమయ ట్రంప్ టవర్‌కు సంబంధించిన ఏఐ చిత్రాన్ని ఆ పోస్టులో పెట్టారు. దీంతో ట్రంప్ ఈ చిత్రాన్ని ఎందుకు పెట్టారు? ఎప్పటిలోగా చంద్రునిపై స్థిర ఆవాసాలకు మార్గం సుగమం అవుతుంది అన్న చర్చలు జోరందుకున్నాయి.
ట్రంప్ పెట్టిన ఏఐ చిత్రంలో.. బంగారువర్ణంతో మెరిసిపోతున్న ఆకాశహర్మ్యం ఉంది. దానిపై ట్రంప్ అనే అక్షరాలు రెండుసార్లు కనిపిస్తున్నాయి. నాసా ఆర్టెమిస్2 ప్రయోగం నేపథ్యంలో ట్రంప్ పోస్ట్ చర్చలకు తావిచ్చింది. ఆర్టెమిస్ ప్రయోగంతో చంద్రునిపై మానవుల స్థిరనివాసాలు ఎప్పటికి సాధ్యమనే అంచనాల్లో అంతా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే.. తనను తాను ఏసుక్రీస్తుతో పోల్చుకుంటూ ఒక ఏఐ ఇమేజ్‌ను షేర్ చేసిన మర్నాడే ట్రంప్ తాజాగా చంద్రునిపై టవర్ ఇమేజ్‌ను షేర్ చేశారు.
ఆటాడుకుంటున్న నెటిజన్లు
ట్రంప్ తాజా పోస్ట్‌పై నెటిజన్లు తలోరకంగా ఆటాడుకున్నారు. ‘ట్రంప్‌కు మైండ్‌లో ఉన్నదంతా దొబ్బింది’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మరొకరు ఆయనను ‘మెంటల్’ అని అభివర్ణించారు. చంద్రునిపై ట్రంప్ టవర్ చాలా ఇబ్బందికరమైనదని ఒకరు వ్యాఖ్యానించారు. తనను తాను దేవుడిగా భావించుకునే వైఖరితో ట్రంప్ బాధపడుతున్నట్టు ఉన్నారని మరొకరు స్పందించారు. ఇంకొకరైతే.. ‘ట్రంప్ చంద్రునిపైకి వెళ్లిపోతానంటూ నేను పూర్తిగా సమర్థిస్తాను. ఆయనకు తగిన ప్రదేశానికి పంపించేయండి’ అని కౌంటర్ వేశారు.
చంద్రునిపై నివాసం ఎప్పుటికి సాధ్యం?
చంద్రునిపైకి మనుషులను పంపించే ప్రక్రియ కోసం ఆర్టెమిస్ ఉద్దేశించారు. అయితే.. అందుకు ఇంకా కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చనే అంచనాలు ఉన్నాయి. నాసాకు చెందిన ఆర్టెమిస్ 2.. అపోలో తర్వాత మొదటిసారిగా చంద్రుని చుట్టూ తిరుగుతున్నది. అర్టెమిస్ 4 లక్ష్యం.. 2028 ప్రారంభం నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపడం. తదుపరి అదే సంవత్సరం చివరిలో ఆర్టెమిస్ 5ను షెడ్యూల్ చేశారు. ఇది చంద్రునిపై తదుపరి ప్రయోగాలకు ఉద్దేశించింది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాండర్స్‌ను ఉపయోగించుకుంటాయి. చంద్రుని ఉపరితలంపై స్వల్పకాలికంగా నివసించేందుకు ఉన్న అవకాశాలను పరీక్షిస్తాయి. మొత్తంగా 2035 నాటికి చంద్రునిపై సిబ్బంది స్థిరనివాసాలకు అవకాశం ఉంటుందనే ఆశాభావంతో శాస్త్రవేత్తలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Deepika Pilli | సుడిగాలి సుధీర్ – దీపికా పిల్లి ప్రేమలో ఉన్నారా.. అసలు విషయం ఇది..!
ఫోన్‌లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు టెమ్రీస్ చెల్లింపులు నెలకు ఆరు లక్షలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram