ట్రంప్ ను తొలగిస్తారా? – అమెరికాలో పెరుగుతున్న ఒత్తిడి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను 25వ సవరణ ద్వారా తొలగించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆయన నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

👉 తీవ్ర వ్యాఖ్యల మధ్య గంభీరంగా స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి

Trump Impeachment Debate Intensifies: Can 25th Amendment Be Invoked Amid Iran Tensions?

హైలైట్స్​:

  • ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్‌పై రాజకీయ ఒత్తిడి
  • 25వ సవరణ ద్వారా అధ్యక్షుడిని తప్పించే అవకాశాలపై చర్చలు
  • సెక్షన్ 4 అమలైతే ఉపాధ్యక్షుడికి అధికార బాధ్యతలు
  • ఇప్పటివరకు ఎప్పుడూ అమలు కాని ఈ సవరణ
  • కాంగ్రెస్‌లో 2/3 మెజారిటీ అవసరం కీలక అంశం

 

విధాత ప్రపంచం డెస్క్​ | హైదరాబాద్​:

Donald Trump impeachment | అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ను అధికారం నుంచి తొలగించేందుకు ఆ దేశంలో ప్రయత్నాలు క్రమంగా ఊపందుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రపంచ దేశాలతో వరుస సైనిక ఘర్షణలు, అధిక సుంకాల విధింపులు వంటి అవాంఛనీయ నిర్ణయాలతో ప్రపంచానికి.. చివరకు అమెరికన్లను కూడా కష్ట నష్టాలకు గురి చేస్తున్నాడంటూ ట్రంప్ పై అమెరికన్లు మండిపడుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యంలో వివాదస్పమవుతున్నాయి. ఇటీవల ట్రంప్ కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు సైతం జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, విదేశాంగ విధానంలో ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ట్రంప్ విదేశాంగ నిర్ణయాలు జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. రక్షణ, దౌత్య పరమైన వ్యూహాల్లో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తెరపైకి అమెరికా రాజ్యాంగం 25వ సవరణ

25వ సవరణ చర్చల నడుమ వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ట్రంప్ — అమెరికా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు (AI Generated)

వాషింగ్టన్ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ అమెరికా చట్టసభ్యుడు ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధికారికంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే అంశానికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం వెల్లడికాలేదు. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం.. ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని లేదా ఆయన నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే ఆయనను పదవి నుంచి తప్పించే అధికారం ఉంటుంది.

 25వ సవరణ ఏమిటి?

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం, అధ్యక్షుడు తన విధులను నిర్వర్తించలేని పరిస్థితి వస్తే ఉపాధ్యక్షుడు మరియు కేబినెట్ మెజారిటీ కలిసి ఆయన అధికారాలను తాత్కాలికంగా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది.

 

ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా ట్రంప్ పై అవిశ్వాసం పెట్టి తొలగించాలన్న భావన చట్టసభ్యులలో బలపడుతున్నట్లుగా ఆ దేశ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం సాగుతుంది. బెట్టింగ్ మార్కెట్లలో సైతం ట్రంప్ ఉద్వాసనకు గురి కావచ్చన్న అంశంపై జోరుగా పందాలు సాగుతుండటం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. గత నెలలో ట్రంప్‌ను 25వ సవరణ ద్వారా తొలగించే అవకాశం ఉందన్న వారి శాతం 28.6% గా ఉండగా…ప్రస్తుతం ఆ అంచనా ఏకంగా 35.1%కి చేరుకుంది. ఈ పరిణామం ట్రంప్ పట్ల, ఆయన పరిపాలన విధానాల పట్ల ప్రజాభిప్రాయంలో వస్తున్న ఈ మార్పుకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రచారమని.. ట్రంప్ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

25వ సవరణ అమలు సాధ్యమేనా?

సైనిక శక్తిని సూచించే యుద్ధ విమానాల మధ్య ట్రంప్ దూకుడు — ఇరాన్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీక

అమెరికా రాజ్యాంగ పరంగా 25వ సవరణను అమలు చేయడం అంత సులభం కాదంటున్నారు ఆ దేశ రాజకీయ నిపుణులు. ఈ సవరణ పక్రియకు కఠినమైన నిబంధనలు ఉన్నాయని, ఈ ప్రక్రియ ప్రారంభం కావాలంటే ముందుగా ఉపాధ్యక్షుడు దీనికి అంగీకరించాలన్న మెలిక ఉందని చెబుతున్నారు. మెజారిటీ కేబినెట్ సభ్యులు అధ్యక్షుడి అసమర్థతను ధృవీకరిస్తూ లేఖ రాయాలని, అప్పుడు కూడా అధ్యక్షుడు దీనిని వ్యతిరేకిస్తే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) లో రెండింట మూడొంతుల మెజారిటీతో దీనిని ఆమోదించాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు. నిజానికి ట్రంప్ తొలగింపు ప్రక్రియ ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందోగాని.. ట్రంప్ పదవిలో కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు కేవలం అమెరికన్లకు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఓ ప్రాధాన్యత అంశంగా మారిపోవడం ఆసక్తికరం.

అధికారిక ఆధారాలు (US Official Sources)

* అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా
National Archives వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఇందులో అధ్యక్షుని స్థానభ్రంశం, బాధ్యతల బదిలీ వంటి ప్రక్రియలు వివరంగా పొందుపరచబడ్డాయి.

* అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించలేని స్థితి వస్తే అనుసరించే విధానం, కాంగ్రెస్ పాత్ర వంటి అంశాలపై మరింత సమాచారం కోసం :  US Congress అధికారిక పోర్టల్ ను సందర్శించవచ్చు.

* అమెరికా అధ్యక్ష వ్యవస్థ, ఉపాధ్యక్షుని పాత్ర, కేబినెట్ అధికారాలపై పూర్తి వివరణ :
White House అధికారిక వెబ్‌సైట్
లో అందుబాటులో ఉంది.

* అదే విధంగా, సెనేట్ వ్యవస్థ, చట్టపరమైన ఆమోద ప్రక్రియలపై వివరాలు తెలుసుకోవాలంటే: 
US Senate అధికారిక వెబ్‌సైట్
ఉపయోగపడుతుంది.

👉 పై అధికారిక లింకులు ఈ అంశంపై స్పష్టమైన రాజ్యాంగపరమైన అవగాహనకు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి :

మందుబాబులపై యుద్దం ఎఫెక్ట్..తెలంగాణలో లిక్కర్ ధరల పెంపు?</a
Laddu Box | లక్షతో ‘లడ్డు’ బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!

Latest News