UAE Celebrates 54th National Day : సూపర్ థ్రిల్లింగ్…యుఏఈ 54వ జాతీయ దినోత్సవం

యుఏఈ 54వ జాతీయ దినోత్సవం ఘనంగా.. ఎయిరియల్ షో, పారా డైవింగ్, గుర్రాలు-ఒంటెల ప్రదర్శనలతో ప్రపంచ దృష్టి ఆకర్షించిన ఈద్ అల్ ఎతిహాద్ వేడుక.

UAE Celebrates 54th National Day : సూపర్ థ్రిల్లింగ్…యుఏఈ 54వ జాతీయ దినోత్సవం

విధాత : యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ జాతీయ దినోత్సవం 54వ ఈద్ ఆల్ ఎతిహాద్ వేడుక ఆధ్యంతం అద్భుత ప్రదర్శనలతో సాగి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అధ్యక్షుడు హెచ్ హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సమక్షంలో దేశ ప్రగతిని..చారిత్రాక, సంస్కృతిక వారసత్వాలను, సాంకేతిక అభివృద్దిని చాటుతూ గొప్ప గొప్ప ప్రదర్శనలతో చూపరులను కనువిందు చేసింది. ఎరోనాటికల్ బృందం ఏరియల్ షో, పారా డైవింగ్ సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

వేడుకల్లోఅరబ్ సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే అరేబియన్ జాతి మేలు రకం గుర్రాలు, ఒంటెల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. అధ్యక్షుడు హెచ్ హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మార్చ్ ఆఫ్ ది యూనియన్ లో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు స్వయంగా ప్రదర్శించిన అందమైన అరేబియన్ గుర్రాల కవాతును ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శను జాతీయ ఐక్యత, సాంస్కృతిక వారసత్వం విశిష్టతను చాటాయి. 3,000 సంవత్సరాల నాటి అరేబియన్ చారిత్రాక, సాంస్కృతిక వారసత్వానికి గుర్రాల కవాతు ప్రదర్శన దర్పణం పట్టింది. ప్రెసిడెన్షియల్ కోర్టు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా తరలివచ్చిన ప్రదర్శకులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి :

Volonaut’s Airbike : ఆకాశంలో రయ్..రయ్..ఎయిర్ బైక్ లు వచ్చేశాయ్..!
Shah Rukh Khan And Kajol : లండన్ లో షారుఖ్-కాజోల్ జంట కాంస్య విగ్రహావిష్కరణ