Frozen Love in Moscow: మాస్కోలో పెళ్లి రోజే మరణం వెనుక రహస్యం
మాస్కోలో టెక్ బిలియనీర్ జంట పెళ్లి వేడుకలో గడ్డకట్టిన ముద్దు! నిజమా కల్పితమా? సోషల్ మీడియాలో వైరల్ అయిన రహస్య కథ.

Frozen Love in Moscow | మాస్కోలో టెక్ బిలియనీర్ జంట పెళ్లి వేడుక… ఆనందం మధ్యలో ఒక్కసారిగా గడ్డకట్టిన శరీరాలు… ముద్దు మధ్యలో కుప్పకూలిన వరుడు, వధువు… ఇది నిజమేనా? లేక సోషల్ మీడియా కల్పితమా? ఈ రహస్యకథలో దాగి ఉన్న నిజం ఏంటి?
మాస్కో – శీతాకాలం. మంచుతో కప్పుకున్న వీధులు, నిశ్శబ్దంగా మెరిసే విద్యుత్ దీపాలు. కానీ, పేట్రోవ్ ఇనిస్టిట్యూట్ లో ఆ రోజు మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. రష్యా టెక్ బిలియనీర్లు విక్టర్, ఎలెనా పేట్రోవ్ ల పెళ్లి వేడుకకు హాజరైన 300 మంది అతిథుల హృదయాల్లో ఆనందం, ఉత్సాహం నిండిపోయింది.
ప్రేమను, భవిష్యత్తును పెళ్లి బంధంతో పంచుకోబోతున్న ఆ జంట కోసం ప్రత్యేకంగా అలంకరించిన హాల్‌లో సంగీతం మోగుతుండగా, అతిథులు గ్లాసుల్లో షాంపైన్ త్రాగుతూ నవ్వులు పంచుకుంటున్నారు. కానీ, ఈ సంతోషం నెమ్మదిగా ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంటుందని ఎవరికీ తెలియదు.
రహస్య దుస్తుల కథ
విక్టర్, ఎలెనా— వీరి కంపెనీ క్రయోజెనిక్స్ (అత్యల్ప ఉష్ణోగ్రతల టెక్నాలజీ) లో అగ్రగామి. అందుకే పెళ్లి దుస్తుల్లోనూ ఆ టెక్నాలజీని జోడించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. “లిక్విడ్ నైట్రోజన్ సిస్టమ్” అమర్చిన ప్రత్యేక గౌను, సూట్ ధరించిన వధూవరులకు తప్ప ఎవరికీ తెలియని, బయటకు కనిపించని చల్లదనం మెల్లగా వారిలో పాకుతోంది.
ఆ క్షణం…
వివాహ మంత్రాల మధ్య, ఎలెనా గౌను మీద మెల్లగా చిన్న క్రిస్టల్స్ ఏర్పడ్డాయి. మొదట అతిథులు దీన్ని ప్రత్యేక ఎఫెక్ట్ అనుకుని చప్పట్లు కొట్టారు. విక్టర్ ఊపిరి తెల్లటి మేఘాల్లా గాల్లో తేలిపోవడం కూడా వాళ్లకు ‘సీన్’ లో భాగమే అనిపించింది. కానీ, శరీర ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతూ -196°C కు చేరుకున్నప్పుడు, ఆ చల్లదనం చావుగా మారింది. ముద్దు పెట్టుకుంటున్న క్షణంలోనే ఇద్దరూ గడ్డ కట్టుకుపోయి నేలపై కుప్పకూలారు.
మరణానంతరం మ్యూజియం ప్రదర్శన?
కథనం ప్రకారం, వైద్య బృందం తక్షణమే పరుగు తీసినా ఫలితం లేకపోయిందట. అంతేకాదు, ఇప్పటికీ వారి గడ్డకట్టిన శరీరాలు పేట్రోవ్ ఇనిస్టిట్యూట్ లో ప్రదర్శనలో ఉంచబడ్డాయని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఆ గ్లాస్ కేసుల్లో నిలబడి ఉన్న రెండు మౌన శరీరాలు – దేనికి సాక్ష్యాలు? ప్రేమకా, టెక్నాలజీకా, లేక ఒక భయంకరమైన ఆటకా?
నిజమా? కల్పితమా?
ఈ కథ వింటే మనసు వికలమౌతుంది. కానీ అధికారిక రికార్డులు, వార్తా నివేదికలు, ధృవీకరణ ఆధారాలు ఎక్కడా లేవు. చాలామంది నిపుణులు ఇది పూర్తిగా సోషల్ మీడియాలో పుట్టిన ‘వైరల్ ఫిక్షన్’ మాత్రమేనని చెబుతున్నారు. “ఇలాంటి కథలు ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపిస్తాయి, ఎందుకంటే ఇవి మనలో షాక్, భయం కలిగిస్తాయి” అంటున్నారు. ఉన్నది కేవలం ఒక్క ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ మాత్రమే. అందులోనే ఆ సందర్భంలో తీసిన ఫోటోలు కనిపిస్తున్నాయి.
నిజమో, కల్పితమో పక్కన పెడితే, ఈ క్రయోజెనిక్స్ కథ కొత్తదేమీ కాదు. తమ మరణానంతరం మృతదేహాన్ని భద్రపరిచిన తర్వాతెప్పుడో బతికించే సాంకేతికత వచ్చినప్పుడు బతికించండి అని డబ్బులిచ్చి మరీ క్రయోనిక్స్లా మారుతున్న ధనవంతుల కోసం క్రయో బ్యాంకులు కూడా వెలిసాయి. ఇది కూడా అటువంటిదే కావచ్చు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి…
‘విరాట్’ పర్వం ముగిసినట్టేనా? రో‘హిట్’ బాదుడు చూడలేమా? సంచలన వార్తల సారాంశం?
బీఆరెస్ పక్కలో ‘విలీన’ బల్లెం! ముగ్గురు ముఖ్య నేతలకు కాల పరీక్ష!