న్యూఢిల్లీ : గోవాలో అగ్ని ప్రమాదానికి కారణమైన( Goa Fire Accident) నైట్ క్లబ్ రెస్టారెంట్ యజమానులు అరెస్టయ్యారు. లూథ్రా బ్రదర్స్(Luthra Brothers Arrest)ను థాయ్ లాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో గోవా పోలీసులు గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలను అరెస్టు(Thailand Arrest) చేశారు. వారి పాస్ పోర్టులను రద్దు చేశారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ వారి పాస్ పోర్టులను సస్పెండ్ చేసింది. లూథ్రా బ్రదర్స్ విదేశాలకు వెళ్లకుండా నిలువరించింది. ప్రమాదం జరిగిన వెంటనే లూథ్రా బ్రదర్స్ డిసెంబర్ 7వ తేదీన తెల్లవారుజామున 1:17 గంటలకు విమాన టిక్కెట్లను బుక్ చేసుకుని.. అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానంలో థాయ్ లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రమాదానికి కారణమైన నైట్ క్లబ్ ఓనర్స్ లూథ్రా బ్రదర్స్ కి గోవా పోలీసులు లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులను అంతకుముందు జారీ చేశారు. నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేయగా..తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్‌ను మాత్రమేనని తెలియజేశాడు. దీంతో లూథ్రా బ్రదర్స్ అసలైన యజమానులుగా తేలారు. ఈ కేసుపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ సీరీయస్ గా తీసుకున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
