Dubai | 67 అంత‌స్తుల భ‌వ‌నంలో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు.. 3,820 మంది సుర‌క్షితం

Dubai | దుబాయ్‌( Dubai )లోని 67 అంత‌స్తుల మెరీనా పినాకిల్( Marina Pinnacle  )భ‌వ‌నంలో శుక్ర‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం( Fire Accident ) సంభ‌వించిన‌ట్లు దుబాయ్ మీడియా ఆఫీసు( Dubai Media Office ) శనివారం అధికారికంగా ప్ర‌క‌టించింది.

Dubai | 67 అంత‌స్తుల భ‌వ‌నంలో ఎగిసిప‌డ్డ అగ్నికీల‌లు.. 3,820 మంది సుర‌క్షితం

Dubai | దుబాయ్‌( Dubai )లోని 67 అంత‌స్తుల మెరీనా పినాకిల్( Marina Pinnacle  )భ‌వ‌నంలో శుక్ర‌వారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం( Fire Accident ) సంభ‌వించిన‌ట్లు దుబాయ్ మీడియా ఆఫీసు( Dubai Media Office ) శనివారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌మాదం నుంచి 764 అపార్ట్‌మెంట్‌ల‌లో ఉంటున్న 3,820 మందిని సుర‌క్షితంగా ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఆరు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

3,820 మందికి తాత్కాలికంగా వ‌స‌తి ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన ప్ర‌దేశంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. బాధితుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌క‌పోవ‌డంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

టైగ‌ర్ ట‌వ‌ర్‌( Tiger Tower )గా పేరొందిన మెరీనా పినాకిల్‌లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి కాదు. 2015 మే నెల‌లో 47వ అంత‌స్తులోని ఓ కిచెన్‌లో మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌లు 48వ అంత‌స్తుకు కూడా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించి మంట‌ల‌ను ఆర్పేసింది.