Crocodile Attack : మొసలి షాకింగ్ ఎటాక్..తప్పిన చావు

ఫ్లోరిడా నదిలో ఈత కొడుతుండగా వ్యక్తిపై మొసలి దాడి చేసింది. అదృష్టవశాత్తూ చిన్న ఎలిగేటర్ కావడంతో బోట్‌లోకి చేరి ప్రాణాలతో బయటపడ్డాడు.

Crocodile Attack : మొసలి షాకింగ్ ఎటాక్..తప్పిన చావు

విధాత: ఓ వ్యక్తి నీటిని సరదాగా ఈత కొడుతూ స్నానం చేసేందుకు చేసిన ప్రయత్నం అతడిని చావు భయాన్ని చూపించింది. అనూహ్యంగా మొసలి ఎటాక్ చేయడంతో చావు భయంతో ప్రాణాలను కాపాడుకునేందుకు బోట్ లోని పరుగుతీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫ్లోరిడాలోని ఓ నది నీటిలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న బోటును ఆపి అందులో నుంచి నీటిలోకి దిగి ఈత కొడుతూ స్నానం చేసే ప్రయత్నం చేశాడు. తను ఈత కొడుతు మధ్యలో చేతులు పైకెత్తి తన అనందాన్ని చాటాడు. అంతలోనే కాలిని ఏదో పట్టుకున్నట్లుగా అనిపించడంతో ఒక్కసారిగా భయంతో నీటిలో తనను పట్టుకున్న జంతువును పైకెత్తి చూడగా..అది మొసలి కావడంతో భయంతో దాన్ని దూరంగా తోసేశాడు. వెంటనే ఈదుకుంటూ వెళ్లి తనకు దగ్గరలోనే ఉన్న బోట్ లోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు.

అయితే ఈ ఘటనలో అతడిపై నీటిలో దాడి చేసింది చిన్న మొసలి( చిన్న ఎలిగేటర్) కావడంతో అతను బతికిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి అదృష్టం బాగుందని దగ్గరలోనే బోట్ ఉండటం..మొసలి చిన్నది కావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని కామెంట్ చేశారు. నదులు, సరస్సులలో నీటిని చూసి ఈత కొడుదామనుకునే ముందు నీళ్లలో నివసించే జంతువుల దాడులను అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్లోరిడాలో గడిచిన 50ఏళ్లలో వందలాది మంది మొసళ్ల దాడులకు గురయ్యారని..వారిలో కొందు చనిపోయారని ఆ రాష్ట్ర అధికారిక లెక్కలు వెల్లడిస్తుండటం ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి :

Grok AI : ‘ఎక్స్’కు భారత్ ప్రభుత్వం నోటీసులు
3rd World Telugu Conference : వైభవంగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం