Indians Shift Focus To 01 Visas | హెచ్-1 బీ వీసా ఫీజు పెంపు: ఓ-1 వీసాల వైపు అందరిచూపు

హెచ్‌1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరిగింది; భారతీయులు అద్భుత ప్రతిభ కోసం ఓ-1 వీసాలకు దృష్టి సారిస్తున్నారు.

Indians Shift Focus To 01 Visas | హెచ్-1 బీ వీసా ఫీజు పెంపు: ఓ-1 వీసాల వైపు అందరిచూపు

హెచ్ 1 బీ వీసా ఫీజు భారం పెరిగింది. దీంతో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో ఓ -1 వీసా కోసం భారతీయులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కొంత కాలంగా ఈ వీసా కోసం ధరఖాస్తులు చేస్తున్నారు. అర్హతలుంటే ఈ వీసాల జారీకి ఇబ్బందులుండవు. 90 శాతానికి పైగా వీసాలను జారీ అవుతున్నాయి.

హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. కొత్తగా వీసాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారికే ఈ ఫీజును వర్తిస్తోంది . ప్రస్తుతం ఈ వీసాలు కలిగిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే భవిష్యత్తులో హెచ్ 1 బీ వీసా కోసం ధరఖాస్తు చేసుకొనే వారికి మాత్రం ఈ ఫీజు భారం తప్పదు. సెప్టెంబర్ 21 నుంచి పెంచిన ఫీజు అమల్లోకి వచ్చింది.

ఓ-1 వీసా అంటే ఏంటి?

తమ తమ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి, అద్భుత విజయాలు సాధించిన వారికి ఓ-1 వీసాలను అమెరికా జారీ చేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (STEM),వ్యాపారం, ఆర్ట్స్, ఫిల్మ్ , కళలు వంటి రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపితే ఈ వీసాలు సులభంగా వస్తాయి. హెచ్ 1 బీ వీసాల కంటే ఈ వీసాల జారీ సులభం. హెచ్ 1 బీ వీసాల ఎంపిక లాటరీ పద్దతిలో ఉంటుంది. అంతేకాదు ధరఖాస్తుల్లో 37 శాతం మందికి మాత్రమే హెచ్ 1 బీ వీసాలు జారీ అవుతాయి. ఓ-1 వీసాలు మాత్రం 97 శాతం జారీ చేస్తారు. ఒక్కసారి వీసా వస్తే మూడేళ్లు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత దాన్ని రెన్యూవల్ చేసుకోవచ్చు. వీసా వచ్చేందుకు మాత్రం అసాధారణ ప్రతిభ ఉన్నట్టు రుజువు చేసుకోవాలి. హెచ్ 1 బీ వీసా రావాలంటే ఏదైనా కంపెనీ లేదా సంస్థ స్పాన్సర్ చేయాలి. లేదా వారి తరపున ధరఖాస్తు చేయాలి. సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ లో అత్యంత ప్రతిభ కలిగి ఉండాలి. కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఆయా కంపెనీలు లేదా సంస్థల తరపున ప్రాజెక్టే మేనేజర్ హెచ్ 1 బీ వీసా కోసం ధృవీకరణ లేఖను ఇవ్వాలి.

ఓ-1 వీసా కోసం ధరఖాస్తు చేసిన సమయంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వస్తే వాటి గురించి తెలపాలి. లేదా వీటి గురించి మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించిన ఆధారాలు. మ రో వైపు తమ తమ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్టుగా ఆధారాలను చూపాలి. హెచ్ 1 బీ వీసా తరహాలోనే హెచ్ -1 బీ 3 వీసా ను కూడా అమెరికా జారీ చేస్తోంది. అమెరికాలో తమ కెరీర్ ను కొనసాగించాలని లక్ష్యంగా ఉన్న ఫ్యాషన్ మోడల్స్ కోసం ఈ వీసాను జారీ చేస్తారు. మోడలింగ్ రంగంలో అసాధారణ ప్రతిభ, నైపుణ్యం ఉన్నట్టు ఆధారాలను చూపాలి.

పెరుగుతున్న అప్లికేషన్లు

ఓ-1 వీసాల కోసం ప్రతి ఏటా ధరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా ఈ వీసాల కోసం ధరఖాస్తులు చేస్తున్నాయి. 2020లో 8,838 వీసాలు జారీ అయ్యాయి. 2024 నాటికి 18,994 వీసాలు మంజూరు చేశారు. దీని ఫీజు 10 నుంచి 30 వేల డాలర్ల వరకు ఉంటుంది. హెచ్ 1 బీ ఫీజు గతంలో 2 నుంచి 5 వేల డాలర్ల వరకు ఉండేది. ఇప్పుడు అది లక్ష డాలర్లకు పెరిగింది. ఓ-1 వీసాల కోసం బ్రిటన్ , బ్రెజిల్ తర్వాత ఇండియా నుంచి ధరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. 2020లో 487 మంది ఇండియన్లు ఈ వీసా కోసం ధరఖాస్తు చేశారు. 2023 నాటికి ఈ సంఖ్య 1418కి చేరింది. టెక్ కంపెనీలు కూడా ఓ-1 వీసాల వైపు ఫోకస్ పెడుతున్నాయి. హెచ్ 1 బీ వీసా తరహాలో ఈ వీసాల జారీకి అడ్డంకులు కూడా ఉండవు.