ఎగిరే కార్లు ‘జెట్‌సన్ వన్’వచ్చేస్తున్నాయ్ !

ఎగిరే కార్లుగా పిలుస్తున్న 'జెట్‌సన్ వన్'ఎలక్ట్రికల్ వాహనాలు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన 'జెట్‌సన్' అనే సంస్థ తయారు చేసిన సరికొత్త వ్యక్తిగత ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ఎగిరే వాహనం విక్రయాలు ప్రారంభమయ్యాయి.

విధాత : ఎగిరే కార్లుగా పిలుస్తున్న ‘జెట్‌సన్ వన్’ఎలక్ట్రికల్ వాహనాలు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన ‘జెట్‌సన్’ అనే సంస్థ తయారు చేసిన సరికొత్త వ్యక్తిగత ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL)ఎగిరే వాహనం విక్రయాలు ప్రారంభమయ్యాయి. రూ 7లక్షల 63 వేలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశాన్ని ఆ కంపెనీ కల్పించింది. టి పాతిక లక్షల ధరను నిర్ణయించారు. గంటకు 102 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ‘జెట్‌సన్ వన్’ వాహనాలతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా గాలిలో విమానం తరహాలో ప్రయాణించవచ్చు.

కేవలం 5రోజుల శిక్షణ తర్వాత, లైసెన్స్ లేకుండానే ఈ ఎగిరే కారును ఎవరైనా నడపవచ్చు. దులో అత్యవసర బ్యాటరీలు, అలాగే అత్యవసర బాలిస్టిక్ పారా‌చ్యూట్‌తో పాటు ఉన్న ఆటోమేటిక్ ల్యాండింగ్ సదుపాయం కలిగిన రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.ఒక పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 20 నిమిషాల పాటు ఎగరవచ్చు.ఈ వాహనం బరువు 115 కిలోలు ఉండగా, నడిపే వ్యక్తి(పైలట్) బరువు 95 కిలోల వరకు ఉండవచ్చు. భూమికి గరిష్టంగా 1,500 అడుగుల ఎత్తు వరకు ఎగరడానికి వీలుంటుంది.ఇంజిన్ లేదా మోటారు విఫలమైనా, మిగిలిన మోటార్ల సాయంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ ఫ్లైట్ కారును రూపొందించారు. వ్యక్తిగత వినోదం కోసం ఉపయోగించే ఈ ఎగిరే కారుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ నెలకొంది. దీని ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో ఇప్పటికే వందలాది యూనిట్లు అమ్ముడయ్యాయి. పామర్ లక్కీ వంటి ప్రముఖులకు కంపెనీ దీనిని డెలివరీ చేసింది.

 

Latest News