విధాత: చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. 2019 ఆఖరులో కరోనా వైరస్ తొలుత చైనాలోని వూహాన్‌లోనే బయటపడిన సంగతి తెలిసిందే. అనంతరం కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన చైనా ప్రస్తుతం కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు బయటపడగా.. అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అత్యధిక సాంక్రమికశక్తి కలిగిన డెల్టా రకంతో పాటు, మరికొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటంతో చైనా మరిన్ని చర్యలు చేపట్టింది.
కంబోడియాలో చిన్నారులకు వ్యాక్సిన్ : దేశవ్యాప్తంగా 6-11 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకాలు వేసేందుకు కంబోడియా ఉపక్రమించింది. ఈమేరకు 18 లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నట్లు ప్రధాని హన్‌సేన్ తెలిపారు. 3-5 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
చైనా లో లాక్‌డౌన్ కొవిడ్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం
<p>విధాత: చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్‌లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్‌జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు