న్యూఢిల్లీ : అమెరికాలోని సాక్రమెంటో నగరంలోని ఓ హైవేపై ఓ మెడికల్ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ఓ మహిళ సహా ముగ్గురు సిబ్భంది తీవ్రంగా గాయపడ్డారు. సాక్రమెంటో అగ్నిమాపక విభాగం ప్రతినిధి కెప్టెన్ జస్టిన్ సిల్వియా తెలిపిన వివరాల మేరకు మెడికల్ హెలికాప్టర్ ఓ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వెలుతున్న క్రమంలో సోమవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా హైవైపై కుప్ప కూలింది.
అదృష్టవశాత్తు హైవైపై హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాన్ని గమనించిన వాహనదారులు దానికి దూరంగా ఆగిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. హెలికాప్టర్ కూలిన ఘటనలో ఓ మహిళ సహా, పైలట్, నర్స్, మరో వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని హెలికాప్టర్ శిధిలాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో హైవైపై ట్రాఫిక్ స్తంభించింది. హెలికాప్టర్ శిధిలాల తరలింపులో భాగంగా ఈ మార్గంలో ట్రాఫిక్ తాత్కాలికంగా మూసివేశామని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ వ్యాలీ డివిజన్ ప్రతినిధి అధికారి మైక్ కారిల్లో తెలిపారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ రీచ్ ఎయిర్ మెడికల్ హెలికాప్టర్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని కారిల్లో చెప్పారు.
BREAKING NEWS: Helicopter Crash Shuts Down Highway 50 in Sacramento
Sacramento, CA – October 7, 2025 — A helicopter has crashed on Highway 50 in Sacramento on Monday evening, causing significant disruptions and leaving multiple victims.
The incident occurred just after 7 p.m.… pic.twitter.com/XhwnPsHxeu
— Manish Kumar ad 🇮🇳 (@ma427906099) October 7, 2025