USA shooting| అమెరికాలో మరోసారి కాల్పులు..ముగ్గురు మృతి
ఇటీవల అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. కాల్పుల ఘటనలను అమెరికాలో పెరిగిన గన్ కల్చర్ కు నిదర్శనంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాాజాగా జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

విధాత : అమెరికాలో మరోసారి కాల్పుల(USA shooting) కలకలం రేగింది. నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టరెంట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి(Three Dead) చెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు గుర్తు తెలియని బోటు నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్‌లో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ వద్దకు చేరుకుంది. అందులోని వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్‌పైకి కాల్పులు జరుపగా. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగుడు అదే బోటులో పారిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని.. దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మృతుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. కాల్పుల ఘటనలను అమెరికాలో పెరిగిన గన్ కల్చర్ కు నిదర్శనంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.