South Africa shooting| దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 10 మంది మృతి
దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయని సమాచారం. జొహన్నెస్‌బర్గ్ శివారులోని ఓ టౌన్‌షిప్‌లో నిరుపేద ప్రాంతమైన బెక్కర్స్‌దాల్‌లో ఈ కాల్పుల ఘటన జరిగింది.
విధాత, హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో కాల్పుల(South Africa shooting) ఘటన కలకలం రేపింది. ఓ గుర్తుతెలియని సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయని సమాచారం. జొహన్నెస్‌బర్గ్ శివారులోని ఓ టౌన్‌షిప్‌లో నిరుపేద ప్రాంతమైన బెక్కర్స్‌దాల్‌లో ఈ కాల్పుల ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
జొహన్నెస్‌బర్గ్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డ్ మైనింగ్ ఏరియా బెక్కర్స్‌దాల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. సుమారు పన్నెండు మంది దుండగులు రెండు వాహనాల్లో వచ్చి బార్‌లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలుస్తుంది. దుండగులు పారిపోతూ కూడా రోడ్డుపై కనిపించిన వారిపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.
ఇదే నెలలో దక్షిణాఫ్రికాలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం గమనార్హం. డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారిసహా 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పారిశ్రామిక దేశమైన దక్షిణాఫ్రికాలో సుమారు 6.3 కోట్ల జనాభా ఉంది. దక్షిణాఫ్రికాలో నేరాలు, హత్యల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటంతో ఆ దేశ ప్రజలను కలవరపరుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram