Karnataka | సైకో భ‌ర్త.. భార్య అందంగా క‌నిపించొద్దని గుండు గీశాడు

Karnataka | ఏ భ‌ర్త అయినా త‌న భార్య అందంగా ఉండాల‌ని కోరుకుంటాడు. పొడ‌వాటి జుట్టు ఉండాల‌ని ఆశ‌ప‌డ‌తాడు. కానీ ఓ భ‌ర్త మాత్రం భార్య అందంగా ఉండటాన్ని స‌హించ‌లేక‌పోయాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. చివ‌రికి సైకోగా మారి ఆమె జుట్టును క‌త్తిరించాడు.

  • By: raj |    national |    Published on : Feb 04, 2026 9:56 PM IST
Karnataka | సైకో భ‌ర్త.. భార్య అందంగా క‌నిపించొద్దని గుండు గీశాడు

Karnataka | ఏ భ‌ర్త అయినా త‌న భార్య అందంగా ఉండాల‌ని కోరుకుంటాడు. పొడ‌వాటి జుట్టు ఉండాల‌ని ఆశ‌ప‌డ‌తాడు. కానీ ఓ భ‌ర్త మాత్రం భార్య అందంగా ఉండటాన్ని స‌హించ‌లేక‌పోయాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. చివ‌రికి సైకోగా మారి ఆమె జుట్టును క‌త్తిరించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌ (Karnataka)లో చోటు చేసుకుంది.

బాగల్‌కోట (Bagalkot) జిల్లాలో జామ్‌ఖండి ప‌రిధిలోని డలబాగి గ్రామంలో నివాసం ఉండే ఉమేశ్‌కు లక్ష్మీబాయి(26) అనే మహిళతో వివాహమైంది. లక్ష్మీ బాయి చాలా అందంగా ఉంటుంది. ఆమె జుట్టు చాలా పొడ‌వుగా, ఆక‌ర్షణీయంగా ఉంటుంది. ఆమె అందం, జుట్టు గురించి ఊర్లో వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఉమేశ్‌కు న‌చ్చలేదు. పైగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె త‌న పొడ‌వాటి జుట్టును పూల‌తో అలంక‌రించుకునేది. అది చూసి ఉమేశ్‌ సహించలేకపోయాడు. భార్య తన పొడవాటి జుట్టుతో యువ‌కుల్ని ఆక‌ట్టుకుంటోంద‌ని అనుమానం పెంచుకున్నాడు. ఈ విష‌యంపై భార్యతో అత‌డు రోజూ గొడ‌వ ప‌డేవాడు. అందంగా రెడీ అవ్వొద్దని, జుట్టుకు పూలు పెట్టుకోవద్దని వాదించేవాడు.

భర్త మాటలను లక్ష్మీబాయి పట్టించుకునేది కాదు. సోమవారం రాత్రి కూడా ఆమె తన జుట్టును పూలతో అలంకరించుకుంది. దాన్ని చూసి ఉమేశ్‌ రగిలిపోయాడు. ఫుల్‌గా మ‌ద్యం తాగి వ‌చ్చిన ఉమేశ్‌.. కొడవలితో భార్యను బెదిరించాడు. ఆ త‌ర్వాత ఆమె వెంట్రుకలను కత్తిరించి గుండు గీశాడు. ఇక తెల్లవారాక లక్ష్మీబాయిని చూసిన ఇరుగుపొరుగు వాళ్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. రాత్రికి రాత్రే గుండు ఎందుకు గీసుకున్నావని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వారి ప్రశ్నలకు విసిగిపోయిన లక్ష్మీబాయి అసలు విషయం చెప్పేసింది. అనుమానంతో భర్తే తనకు గుండు గీశాడని జరిగిందంతా వివరించింది. అది విన్న స్థానికులు ఆగ్రహించారు.

ఉమేశ్‌పై పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు ఉమేశ్‌ ఇంటికెళ్లి విచారించారు. దీంతో అతడు నేరం అంగీకరించాడు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నెట్టింట కూడా తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతనేం భర్త అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.