red sky incident| అరుణవర్ణం దాల్చిన ఆకాశం.. ఆస్ట్రేలియాలో వింత వెనుక శాస్త్రీయ కోణం తెలుసా?

ప్రకృతిలో ఆకస్మికంగా తలెత్తే అనూహ్య మార్పులు ఒక్కోసారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంటాయి. అనూహ్యంగా వాతావారణం మారిపోయి..ఒక్కసారిగా ఆకాశం అంతా ఎర్రగా మారిపోయి..రక్త వర్ణంతో భయపెడితే..ఏం జరుగబోతుందో తెలియక జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భయంకర, అద్భుత, అశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలోని డెన్ హామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Mar 29, 2026, 7:31 pm IST
Read Time: 4 mins
red sky incident| అరుణవర్ణం దాల్చిన ఆకాశం.. ఆస్ట్రేలియాలో వింత వెనుక శాస్త్రీయ కోణం తెలుసా?

విధాత : ప్రకృతిలో ఆకస్మికంగా తలెత్తే అనూహ్య మార్పులు ఒక్కోసారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంటాయి. ఆకస్మికంగా విరుచకపడే భూకంపాలు, సునామీలు, పిడుగుల జడివానల సంకేతాలను అభివృద్ది చెందిన శాస్త్రీయ విజ్ఞానం తో ముందే పసిగట్టేస్తుండటంతో మనుషులు వాటిని ఎదుర్కోవడంలో కొంత సంసిద్దమవుతూ ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించుకోగలుగుతున్నారు. అయితే అనూహ్యంగా వాతావారణం మారిపోయి..ఒక్కసారిగా ఆకాశం అంతా ఎర్రగా మారిపోయి..రక్త వర్ణంతో భయపెడితే..ఏం జరుగబోతుందో తెలియక జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భయంకర, అద్భుత, అశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలోని డెన్ హామ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వాతావరణ మార్పులను అనుసరించి ఆకాశం ఒక్కోసారి నీలం, తెలుపు, నలుపు రంగుల్లో కనిపించడం సహజం. అందుకు భిన్నంగా ఒక్కసారిగా ఆకాశం అంతా ఎర్రటి రంగులోకి మారడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అకాశం ఎందుకు ఎర్రబడిందో అర్ధం కాక..ఏ ప్రకృతి వైపరిత్యం ముంచుకోస్తుందోనన్న భయంతో అక్కడి ప్రజలు వణికిపోయారు. ఇది సహజ ప్రకృతి వైవిధ్యంగా కనిపించినప్పటికి .. చూసే వారికి మాత్రం భయానక అనుభూతి మిగిల్చింది.

ఇలా అప్పుడప్పుడు ప్రకృతి అద్భుతాలు సృష్టించే వాతావరణ మార్పుల వెనుక శాస్త్రీయమైన కారణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశం ఎర్రగా మారడానికి ఆ ప్రాంతంలో ఐరన్ ఆక్సైడ్ (ఇనుప ధూళి) ఎక్కువగా ఉండటమే కారణం అని, నరెల్ తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులు ఈ ఎర్రటి ధూళిని గాల్లోకి ఎగరేశాయని, సూర్యకిరణాలు ఆ ధూళి కణాలపై పడటంతో  ఆకాశం మొత్తంతో పాటు పరిసరాలు ఎర్రగా కనిపించాయి అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ వాతావరణ మార్పులకు భయపడాల్సిందేమి లేదని స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.