Russia Drone Attack : రష్యాలో డ్రోన్ దాడి.. 24 మంది మృతి
న్యూ ఇయర్ వేళ రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కలకలం రేపాయి. ఖేర్సన్ ప్రాంతంలో కేఫ్, హోటల్‌పై దాడుల్లో 24 మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ : న్యూ ఇయర్ వేళ స్విట్జర్లాండ్ బార్ లో పేలుడు ఘటన, రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు విషాదాన్ని రేపాయి. రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులలో 24మంది మరణించారు. ఖేర్సన్ రీజియన్‌లోని నల్ల సముద్రం తీరంలో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్‌పై మూడు డ్రోన్లతో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది చనిపోగా మరో 50మందికిపైగా గాయపడ్డారు.
ప్రజలు కొత్త సంవత్సర వేడుకల్లో ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. అటు స్విట్జర్లాండ్ లో న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన వేడుకల్లో ఓ బార్ లో జరిగిన పేలుడుతో చెలరేగిన మంటల్లో 40మందికి పైగా మరణించారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ బాంబు దాడులకు పాల్పడిందన్న వార్తలను అమెరికా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ దాడికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
Retirement Age 64 Years | ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 64?
Antarvedi Beach Accident : సముద్రంలోకి దూసుకెళ్లిన థార్..ఒకరి మృతి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram