ఫోటోలు పంపండి ప్రజలను కోరినా నాసా
గ్రహణాల వల్ల కలిగే మార్పులను అద్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నాసా గ్రహణం సందర్భంగా ఫోటోలు పంపాలని ప్రజలను కోరింది.
గ్రహణాల వల్ల కలిగే మార్పులను అద్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నాసా గ్రహణం సందర్భంగా ఫోటోలు పంపాలని ప్రజలను కోరింది.
వచ్చిన ఫోటోలతో ఏఐసాయంతో విశ్లేషణ
విధాత: గ్రహణాల వల్ల కలిగే మార్పులను అద్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నాసా గ్రహణం సందర్భంగా ఫోటోలు పంపాలని ప్రజలను కోరింది. గ్రహణాల వల్ల కలిగే మార్పుల అధ్యయనానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నది. అంతేకాక, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో కూడా తెలుస్తుందని తెలిపింది.
ఈ ప్రయోగాలే కాకుండా నాసా ఎక్లిప్స్ మెగామూవీ అనే మరో ఆసక్తికర ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం నాసా, గ్రహణాన్ని వీక్షించే వారికి ఓ విజ్ఞప్తి చేసింది. గ్రహణం ఏర్పడినప్పుడు ఫోటోలు తీసి, తమకు పంపాలని కోరింది. అలా ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చే ఫోటోలన్నింటినీ కలిపి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషణ చేయనుంది. ఈ ఫొటోలతో సూర్యుడి కరోనాకు సంబంధించి మరింత వివరంగా తెలుస్తుంది.
కరోనా అంటే సూర్యుడి చుట్టూ పలు రకాల వాయువులతో ఏర్పడిన వాతావరణం. సాధారణంగా సూర్యుడిపై ఉండే తీవ్రమైన కాంతి వల్ల ఈ కరోనా కనిపించదు. దానిని చూసేందుకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయితే, గ్రహణాల సమయంలో దీనిని సులభంగా చూడొచ్చు. అంతేకాదు, సూర్యుడికి అతి సమీపంలో ఉన్న నక్షత్రాలను కూడా చూడొచ్చు. ఈ ఫోటోల ద్వారా వాటిపై కూడా అధ్యయనం చేయడం ఈ ప్రయోగంలో మరో ముఖ్య లక్ష్యం అని నాసా పేర్కొన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram