నేడు ఆకాశంలోఖగోళ అద్భుతం

విధాత‌,న్యూఢిల్లీ : ఈ రోజు ఆకాశంలోఖగోళ అద్భుతం చోటు చేసుకోనున్నది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం ఏర్పడనున్నది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఈ అద్భుతం దృశ్యం పలు దేశాల్లో కనిపించనుండగా.. కొన్ని దేశాల్లో మాత్రమే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దర్శనమివ్వనుంది. సూర్యగ్రహణం భారత్‌లో మాత్రమే పాక్షికంగా కనిపించనుంది. కేవలం అరుణాచల్‌ […]

నేడు ఆకాశంలోఖగోళ అద్భుతం

విధాత‌,న్యూఢిల్లీ : ఈ రోజు ఆకాశంలోఖగోళ అద్భుతం చోటు చేసుకోనున్నది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం ఏర్పడనున్నది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. ఈ అద్భుతం దృశ్యం పలు దేశాల్లో కనిపించనుండగా.. కొన్ని దేశాల్లో మాత్రమే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దర్శనమివ్వనుంది. సూర్యగ్రహణం భారత్‌లో మాత్రమే పాక్షికంగా కనిపించనుంది. కేవలం అరుణాచల్‌ ప్రదేశ్‌లో సూర్యాస్తమయం సమయంలో కనిపిస్తుందని మధ్యప్రదేశ్‌లోని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు తెలిపారు.

భారత్‌లో సూర్యగ్రహణం మధ్యాహ్నం 1.42 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.41 గంటలకు ముగియనుంది. గ్రహణాన్ని ఉత్తర అమెరికా ప్రజలు, యూరప్, ఆసియా, ఉత్తర కెనడా, రష్యా, గ్రీన్‌లాండ్‌లో కనిపించనుంది. సూర్యగ్రహణం ఉచ్ఛస్థితికి చేరినప్పుడు ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్‌ గ్రీన్‌లాండ్‌, సెర్బియాతో పాటు ఉత్తర ధృవానికి చివరన ప్రాంతాల్లో కనిపిస్తుందని టైమ్‌ అండ్‌ డేట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈస్ట్‌కోస్ట్, అప్పర్ మిడ్‌వెస్ట్ దేశాల ప్రజలు పాక్షికంగా ఈ అద్భుతం కనిపిస్తుందని చెప్పింది. గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రత్యక్ష్య ప్రసారం చేస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా.. డిసెంబర్‌ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.