అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల ఒక ప్రణాళికను రూపొందించిందని హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ అమెరికాతో పంచుకున్నట్లు ఓ నివేదిక బయటకు రావడం కలకలం రేపింది. అయితే ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేయాలా వద్దా అని ట్రంప్ ఆలోచిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయెల్ ఇలాంటి నివేదికలతో ప్రయత్నిస్తోందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ నివేదికను అమెరికా సీరియస్ తీసుకోవడం లేదని ఆ దేశా నిఘా సంస్థ పేర్కొంది.లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యకు గాను ట్రంప్, నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రయత్నాలను ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇరాన్ అంతు చూస్తాం..అందుకు ఆదేశాలిచ్చాను : ట్రంప్
ఇదిఇలా ఉండగానే తన హత్యకు కుట్ర ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ ఇరాన్ నన్ను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. 1000 క్షిపణులు ఒక్కసారిగా విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్‌లో పోస్ట్‌పెట్టారు. అందుకు సంబంధించి ఇప్పటికే తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించారు.అయితే టెహ్రాన్ నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నానని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ..రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా ఆగ్రహంతో ఉంది. నౌకలపై దాడులు ఆపడంతో పాటు శాంతి ఒప్పందంపై ముందుకు వచ్చే విషయమై ఇరాన్ కు 24గంటల సమయం ఇస్తున్నట్లుగా తాజాగా ట్రంప్ ప్రకంటించారు.
