Ukraine attack | రష్యాపై అనూహ్యంగా విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. డ్రోన్‌లతో భీకర దాడి.. మోదీ పర్యటన ముందు ఘటన..!
Ukraine attack | ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్దం కొత్త మలుపు తీసుకుంది. అమెరికా, యూరప్ దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై నిప్పులు కురిపిస్తోంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అనూహ్యంగా దాడిచేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో సరిహద్దులోని రష్యా నగరాలు, గ్రామాలపై భీకర దాడులకు పాల్పడింది.

Ukraine attack : ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్దం కొత్త మలుపు తీసుకుంది. అమెరికా, యూరప్ దేశాల నుంచి అందుతున్న అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై నిప్పులు కురిపిస్తోంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అనూహ్యంగా దాడిచేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో సరిహద్దులోని రష్యా నగరాలు, గ్రామాలపై భీకర దాడులకు పాల్పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా రష్యాలోని వొరోనెజ్ రీజియన్‌లోని పలు ఏరియాల్లో పుతిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ ప్రాంతంలోని రష్యా ఆర్మీకి చెందిన మందుగుండు గోదాములు లక్ష్యంగా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడులు చేసింది. దీంతో ఆ గోదాముల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని వొరోనెజ్ గవర్నర్ అలెగ్జాండర్ గుసేవ్ తెలిపారు.
కానీ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నట్లు గుసేవ్ వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.