చికున్‌ గున్యాకు వ్యాక్సిన్‌ వచ్చేసింది..! ప్రపంచంలోనే తొలి టీకాకు ఆమోదం తెలిపిన ఎఫ్‌డీఐ

చికున్‌ గున్యాకు వ్యాక్సిన్‌ వచ్చేసింది..! ప్రపంచంలోనే తొలి టీకాకు ఆమోదం తెలిపిన ఎఫ్‌డీఐ

దోమల ద్వారా వ్యాపించే చికున్‌ గున్యాకు వ్యాక్సిన్‌ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయగా.. అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌కు అధికారులు గురువారం టీకాకు ఆమోద ముద్రవేశారు. ఐరోపాకు చెందిన వాల్నేవా కంపెనీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌కు లిక్స్‌చిక్ (Ixchiq) నామకరణం చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని ఎఫ్‌డీఏ తెలిపింది.


లిక్స్‌చిక్‌ వ్యాక్సిన్‌ను చికున్‌ గున్యాకు వైరస్‌ ఎక్కువగా ప్రబలుతున్న దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని యూఎస్‌ డ్రగ్‌ రెగ్యులరేటరీ వెల్లడించింది. చికున్‌ గున్యా దోమల ద్వారా వ్యాపిస్తుంటుంది. ఎక్కువగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. వైరస్‌ బారినపడితే జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులుంటాయి.


ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. తొలిసారిగా వాల్నేవా కంపెనీ టీకాను తీసుకువచ్చింది. అయితే, గత 15 సంవత్సరాలలో 5మిలియన్లకుపైగా జనం ఈ వైరస్‌ బారినపడ్డారు. చికున్‌ గున్యా వైరస్‌ సోకితే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటుందని.. ఫలితంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఎఫ్‌డీఏ సీనియర్‌ అధికారి పీటర్‌ మార్క్స్‌ తెలిపారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. టీకాకు ఆమోదం లభించడంతో వైరస్‌ను నివారించడంలో కీలకమైన పురోగతి సాధించినట్లేనన్నారు.


వైరస్‌ సోకితే సింగిల్‌ షాట్‌ సరిపోతుందని.. ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే చికున్‌ గున్యా వైరన్‌ను సమర్థవంతంగా పని చేస్తుందని ఎఫ్‌డీఏ అధికారులు పేర్కొన్నారు. వాల్నేవా కంపెనీ రూపొందించిన టీకాపై అమెరికాలో దాదాపు 3500 మందిపై రెండుసార్లు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. కొందరిలో తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్లనొప్పులు, జ్వరం, వికారం తదితర సాధారణ దుష్ప్రభావాలు కనిపించాయి. ట్రయల్స్‌లో 1.6శాతం మాత్రమే లిక్‌చిక్‌ టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కనిపించగా.. ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.