విధాత : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మరోసారి తండ్రి కాబోతున్నారు. వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ ప్రస్తుతం గర్బవతిగా ఉన్నారు. బేబీ బంప్‌తో ఉషా వాన్స్ ఫ్లైట్ నుంచి దిగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జేడీ- ఉషా వాన్స్‌లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఉషా వాన్స్ 2026 జూలైలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన సైతం వెలువడింది. తల్లి, కడుపులో ఉన్న బిడ్డ సంరక్షణకు మిలటరీ డాక్టర్ల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండగా, సెకండ్ లేడీ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. నాల్గవ సంతనానికి జన్మనిస్తున్నట్లుగా వాన్స్ దంపతుల ప్రకటన నేపథ్యంలో మద్దతుదారులు, సన్నిహితులు వాన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి కుటుంబంలోకి వస్తున్న మొదటి సంతానం ఇదే కావడం విశేషం.
జేడీ వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్, ఉషా దంపతుల మొదటి సంతానంగా కుమారుడు ఇవాన్ 2017లో జన్మించాడు. ప్రస్తుతం ఇవాన్ వయసు సుమారు 8 ఏళ్లు.రెండో కుమారుడి పేరు వివేక్. వివేక్ 2020 ఫిబ్రవరిలో జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 6 ఏళ్లు. ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడంతో అతనికి తెలుగు పేరుపెట్టడం విశేషం. గతంలో జేడీ వాన్స్, వివేక్ పుట్టినరోజు నాడు సెనేట్‌లో డాక్టర్ సీస్ (Dr. Seuss) పుస్తకం చదివి వినిపించడం వైరల్ అయ్యింది. ఇక మూడో సంతానంగా వాన్స్ దంపతులకు కూతురు పుట్టింది. ఆమెకు మిరాబెల్ అని పేరు పెట్టారు. ఈ పాప 2021 డిసెంబర్‌లో జన్మించింది. మిరాబెల్ వయసు ఇప్పుడు సుమారు 4 ఏళ్లు.ఇప్పుడు వీరి కుటుంబంలోకి నాలుగో చిన్నారి రాబోతుండటంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Naga Chaitanya | నాగచైతన్యకు వరుస అవార్డులు.. ‘తండేల్’తో మరో మైలురాయి.. ఐఎన్‌సీఏలోనూ సత్తా
అకిరా పుట్టినరోజు.. మార్క్ శంకర్ పునర్జన్మ: పవన్ భార్య లెజినోవా ఎమోషనల్
