అకిరా పుట్టినరోజు.. మార్క్ శంకర్ పునర్జన్మ: పవన్ భార్య లెజినోవా ఎమోషనల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ తనయుడు కోణీదెల అకిరా నందన్ ఇవాళ (ఏప్రిల్ 8) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు చేశారు.
విధాత : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు కోణీదెల అకిరా నందన్ (Akira Nandan) ఇవాళ (ఏప్రిల్ 8) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు చేశారు.
ఈ పోస్ట్ లో అకిరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే, ఏడాది క్రితం ఇదే రోజున సింగపూర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదంలో తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించారు. మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకున్నప్పటికీ, అకిరా పుట్టినరోజే మార్క్ శంకర్ కి జరిగిన ఆ సంఘటన తమ కుటుంబానికి ఎంతో ఆవేదన కలిగించిందని తెలిపారు. అందుకే ‘ఇవాళ ఒకరి బర్త్‌డే.. మరొకరికి పునర్జన్మ’ అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ ప్రమాదంలో ఒక 10 ఏళ్ల చిన్నారి ఫ్రేయా మృతి చెందినందుకు అన్నా లెజినోవా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆ ప్రమాదంలో గాయపడిన ఇతర పిల్లలకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అకిరా ఎదుగుతున్న తీరు గర్వంగా ఉందని, తమ ఇద్దరు కుమారుల బర్త్ డేలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామని, కానీ మార్క్‌కు ఇది రెండో పుట్టినరోజులా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.
అలాగే, ఫైర్ సిబ్బంది రాకముందే 15 మంది పిల్లలను రక్షించిన నిర్మాణ కార్మికులను ఆమె ‘నిజమైన హీరోలు’ అని ప్రశంసించారు. చివరిగా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ప్రతి ఇంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదా ఫైర్ బ్లాంకెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని ఆమె అందరికీ సేఫ్టీ అలర్ట్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
లైవ్ లో పులుల వేట..అభయారణ్యంలో మనుషుల అతి!
Anganwadi Teacher | భర్త చేసిన తప్పుకు.. అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేశారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram