Joe Biden | ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న : అమెరికా అధ్యక్షుడు బైడెన్
Joe Biden | ఒకప్పుడు ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు కూడా వచ్చాయని.. అయితే వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తనకు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.
Joe Biden : ఒకప్పుడు ఆత్మ హాత్మ చేసుకోవాలనే ఆలోచనలు తనకు కూడా వచ్చాయని.. అయితే వెంటనే వాటి నుంచి బయటపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి డెలావేర్ మెమోరియల్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లిన తనకు అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.
అయతే ఆ సమయంలో తన పిల్లల గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. 1972 సంవత్సరంలో తొలిసారి సెనేటర్‌గా గెలుపొందిన కొన్ని రోజులకు తన భార్య నీలియా, 18 నెలల బాబు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారని బైడెన్ వెల్లండించారు. ఆ సమయంలో తాను చాలా బాధ అనుభవించానని, ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు.
ఆ బాధలో తాగటం అలవాటు లేని తాను మందు బాటిల్ తీసుకొని డెలావేర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్లానని, అక్కడ మందు తాగుతుండగా ఆత్మహత్య ఆలోచన వచ్చిందని, కానీ తన మిగతా ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని బైడెన్ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయకూడదని చెప్పారు.
ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికలకు ముందే డిబేట్‌లో పాల్గొనాలని ఉందన్నారు. ఎక్కడైనా ఓ చోట ట్రంప్‌తో డిబేట్ తనకు సంతోషమని చెప్పారు. బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ సైతం ప్రతిస్పందించారు. ‘ నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా బైడెన్‌తో డిబేట్‌కు అంగీకరిస్తున్నా’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
కాగా, సెప్టెంబర్ 16న టెక్సాస్‌లోని శాన్ మార్కోస్‌లో, అక్టోబర్ 1న వర్జీనియాలోని పీటర్స్‌బర్గ్‌లో, అక్టోబర్ 9న సాల్ట్ లేక్ సిటీలో అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లు జరగనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram