VIDEO: ఇజ్రాయిల్ దాడిలో యెమెన్ మంత్రివర్గం హతం
ఇజ్రాయిల్ _యెమెన్ యుద్ధంలో హౌతులకు గట్టి షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. సనలో హౌతిల పాలనలో ఉన్న రెబెల్ యెమెన్ ప్రధానమంత్రితో సహా, అనేక మంది మంత్రులు ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యారు

విధాత ప్రతినిధి: ఇజ్రాయిల్ _యెమెన్ యుద్ధంలో హౌతులకు గట్టి షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. సనలో హౌతిల పాలనలో ఉన్న రెబెల్ యెమెన్ ప్రధానమంత్రితో సహా, అనేక మంది మంత్రులు ఇజ్రాయెల్ దాడిలో హతమయ్యారు. ఈ దాడిలోహౌతీల రక్షణ అధిపతి, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితుడైన డిప్యూటీ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ “అణిచివేత దెబ్బ”ను ప్రశంసించారు, హౌతీలు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
రాయిటర్స్ వార్తసంస్థ వివరాలుమేరకు- సీనియర్ అధికారులను చంపడానికి జరిగిన మొదటి దాడిలో యెమెన్ హౌతీల పాలనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన మంత్రి, అనేక మంది మంత్రులు రాజధాని సనాపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారని హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధిపతి శనివారం తెలిపారు. గురువారం జరిగిన దాడిలో సైతం అనేక మంది గాయపడ్డారని మహదీ అల్-మషత్ వెల్లడించారు.
హౌతీల ప్రకారం, గురువారం ప్రభుత్వ వర్క్‌షాప్‌కు హాజరైనప్పుడు జరిగిన దాడిలో అల్-రహావి, అనేక మంది మంత్రులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం సనాలోని “హౌతీ ఉగ్రవాద ప్రభుత్వ లక్ష్యాన్ని తన వైమానిక దాడులతో హతం చేసింది ” అని రాయిటర్స్ తెలిపింది.