Betting Apps | ఇప్పటికే 108యాప్స్ తొలగించాం: డీజీ షికా గోయల్
తెలంగాణలో ఇప్పటివరకు 108 బెట్టింగ్ యాప్స్ ఆన్‌లైన్ నుంచి తొలగించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌పై 800 వరకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

Betting Apps: దేశంలో తొమ్మిది రాష్ట్రాలతో పాటు తెలంగాణలో 2017నుంచి బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడడం పూర్తిగా చట్ట వ్యతిరేకమ్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 108 బెట్టింగ్ యాప్స్ ఆన్‌లైన్ నుంచి తొలగించామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌పై 800 వరకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
ఇటీవల రాష్ట్ర పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. బెట్టింగ్ యాప్స్‌లో ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరూ నమ్మకూడదని, వీటి బారిన పడి మోసపోయి..ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్‌పై నిఘా ఉంచామని తెలిపారు.