Air IndiaFlight| ఏయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు..ప్రయాణికులు క్షేమం
అమరావతి : విమానం రెక్కకు పక్షి ఢీకొట్టిన ఘటనలో ఏయిర్ ఇండియా(Air India Flight)విమానానికి భారీ ప్రమాదం తప్పింది. విజయవాడ-బెంగళూరు ఏయిరిండియా విమానం గన్నవరం(Gannavaram Airport) ఎయిర్ పోర్టులో టేకాఫ్ అవుతుండగా రెక్కను ఓ పక్షిఢీ కొట్టింది. దీంతో ఫ్యాన్ తిరగడాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు.
విమానాన్ని అత్యవసరంగా(Emergency Landing)చాకచక్యంగా సురక్షితంగా రన్ వేపై సేఫ్ ల్యాండింగ్ చేశారు. అనంతం విమాన ప్రయాణికులను విమానం నుంచి దించేసి విమానాశ్రయం లాంజ్ లోకి పంపించారు. ప్రమాద సమయంలో విమానంలో 100మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా(Passengers Safe)ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram