Anna Konidela | ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘అన్నా కొణిదెల’ .. గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన ప‌వ‌న్ కళ్యాణ్, తొలి పోస్ట్ ఏంటి?

Anna Konidela | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన పేరును ‘అన్నా కొణిదెల’గా మార్చుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ఖాతా ప్రారంభించడం ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు సోషల్ మీడియా వేదికపై స్వాగతం పలకడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

Reported by: Sandeep | Latest News | Mar 25, 2026, 2:36 pm IST
Read Time: 4 mins
Anna Konidela | ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘అన్నా కొణిదెల’ .. గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన ప‌వ‌న్ కళ్యాణ్, తొలి పోస్ట్ ఏంటి?

Anna Konidela | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన పేరును ‘అన్నా కొణిదెల’గా మార్చుకుంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ఖాతా ప్రారంభించడం ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు సోషల్ మీడియా వేదికపై స్వాగతం పలకడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

పవన్ కళ్యాణ్ తన సందేశంలో “డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను” అంటూ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా, అన్నా లెజినోవా కూడా తన మొదటి పోస్ట్‌ను ఎంతో భావోద్వేగంగా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోను పోస్ట్ చేస్తూ, “ఇది చాలా కాలం క్రితమే జరగాల్సింది. కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆమె బయోలో “రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్” అని రాసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మెగా అభిమానులు అన్నా కొణిదెలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఇక మెగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చిరంజీవి , ఇతర హీరోలు ఆమె సోషల్ మీడియా ఎంట్రీపై ఎలా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా, అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ మెగా ఫ్యాన్స్‌కు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్‌గా మారింది.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలోను యాక్టివ్ గా ఉంటున్నారు. పవన్ గత చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింధి. మూవీ పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా, చిత్రానికి మిక్స్ డ్ టాక్ లభించింది. త్వరలో సురేందర్ రెడ్ఢి దర్శకత్వంలో మూవీ చేయనున్నారు పవన్.

View this post on Instagram

A post shared by Anna Konidala (@anna.konidala)