ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న బాలీవుడు నటులు బాలీవుడ్ నటులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

విధాత : ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్నాడు. ఇంతలోనే మరోసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. క్రిమిటోరియల్ వద్ద వేచి ధర్మేంద్ర కుటుంబ సభ్యులు భౌతిక ఖాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న బాలీవుడు నటులు బాలీవుడ్ నటులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు.

1935డిసెంబర్ 8న పంజాబ్ లోని నస్రాలీలో జన్మించిన ధర్మేంధ్ర ఆరు దశాబ్ధాల పాటు బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షక లోకాన్ని అలరించారు. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ దేవళ్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’లో వీరూ పాత్రలో నటించిన ధర్మేంద్ర అగ్రనటులలో ఒకరిగా ఎదిగారు. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్ తదితర చిత్రాలతో తన నటనతో ఆకట్టుకున్నారు. 300పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్ కింగ్, హీమ్యాన్ గా ఆయనకు ఫిల్మీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది.   ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాడు. 2012లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. రాజస్థాన్ లోని బికనూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన సతీమణి హెమమాలిని కూడా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ధర్మేంద్రకు సన్నిడియోల్, బాబీ డియోల్, ఈషా డియోల్, ఆహానా డియోల్ సంతానంగా ఉన్నారు.