Delhi | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు
ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకుంది. ఎర్రకోట గేట్ నెం1 సమీపంలో పేలుడు సంభవించింది. మెట్రోస్టేషన్ దగ్గర కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో.. జన భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.
న్యూ ఢిల్లీ :
ఢిల్లీలో భారీ పేలుడుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకుంది. ఎర్రకోట గేట్ నెం1 సమీపంలో పేలుడు సంభవించింది. మెట్రోస్టేషన్ దగ్గర కారు నుంచి బ్లాస్ట్ జరగడంతో.. జన భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 20 మంది వరకూ గాయపడ్డారు. ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. పేలుడు ఘటనలో ఒకరి మృతదేహం ఛిద్రం అయింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న మంటలు ఆర్పారు. పేలుడుతో ఢిల్లీ మొత్తం హై అలర్డ్ ప్రకటించి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బాంబ్ స్వ్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ శివార్లలో ఇవాళే ఉగ్ర కుట్ర భగ్నం చేసిన పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్ జరగడం సంచలనంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram