Gold Ring stolen | సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు ఉంగరాన్ని కొట్టేసిన త‌ల్లీబిడ్డ‌.. వీడియో

Gold Ring stolen | బంగారం ధ‌ర‌లు( Gold Prices ) భ‌గ్గుమంటున్న విష‌యం తెలిసిందే. సామాన్యుడి కొన‌లేని స్థితికి ప‌సిడి ధ‌ర‌లు చేరాయి. ఈ క్ర‌మంలో విలువైన బంగారం ఉంగరాన్ని( Gold Ring ) త‌ల్లీబిడ్డ క‌లిసి సెక‌న్ల వ్య‌వ‌ధిలో అప‌హ‌రించారు. అది కూడా బంగారం షాపు( Gold Shop )లో.

  • By: raj |    national |    Published on : Oct 27, 2025 9:11 AM IST
Gold Ring stolen | సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు ఉంగరాన్ని కొట్టేసిన త‌ల్లీబిడ్డ‌.. వీడియో

Gold Ring stolen | న్యూఢిల్లీ : వీళ్లిద్ద‌రిని చూస్తుంటే ఎంతో నైపుణ్యం క‌లిగిన దొంగ‌ల( thieves ) మాదిరి క‌నిపిస్తున్నారు. ఎందుకంటే వారు చోరీ చేసిన విధానం చూస్తుంటే.. ఇలాంటి దొంగ‌త‌నాలు ఎన్నో చేసి ఉంటార‌ని అనిపించ‌క త‌ప్ప‌దు. ఓ బంగారు న‌గ‌ల దుకాణం( Gold Shop )లోకి ప్ర‌వేశించిన త‌ల్లీబిడ్డ సెక‌న్ల వ్య‌వ‌ధిలో గోల్డ్ రింగ్‌( Gold Ring )ను కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ( Delhi ) న‌గ‌రంలోని ల‌క్ష్మీన‌గ‌ర్‌( Lakshmi Nagar )లో ర‌ద్దీగా ఉన్న ఓ న‌గ‌ల దుకాణానికి త‌ల్లీబిడ్డ వెళ్లారు. ఇక వారికి బంగారం షాపులో ప‌ని చేసే వారు.. గోల్డ్ రింగ్స్‌ను చూపించారు. గోల్డ్ బాక్స్ తెరిచి ముంద‌ర పెట్ట‌గానే.. త‌ల్లి ఓ ఉంగరాన్ని త‌న చేతుల్లోకి తీసుకుంది. క్ష‌ణంలో ఫేక్ ఉంగ‌రాన్ని బాక్సులో పెట్టి ఒరిజిన‌ల్ బంగారు ఉంగ‌రాన్ని త‌న చేతుల్లోకి తీసుకుంది. అంతే వేగంగా.. ప‌క్క‌న కూర్చున్న త‌న బిడ్డ‌కు గోల్డ్ రింగ్‌ను ఇచ్చింది. ఆమె కూడా ఎంతో సులువుగా ఆ ఉంగ‌రాన్ని త‌న బ్యాగులో వేసుకుంది.

ఇక ఈ బాక్సులో ఉన్న ఉంగ‌రాలు న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో షాపు నిర్వాహ‌కులు మ‌రో బాక్సు వారి ముందు ఉంచారు. బంగారం కొనేందుకు వ‌చ్చిన‌ట్లు న‌టించి.. విలువైన బంగారం ఉంగరాన్ని త‌ల్లీబిడ్డ త‌స్క‌రించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా గోల్డ్ షాపు సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చోరీకి పాల్ప‌డ్డ త‌ల్లీబిడ్డ ఆచూకీ కోసం పోలీసులు య‌త్నిస్తున్నారు.