Rasi Phalalu: Feb22, శనివారం.. ఈరోజు మీ రాశి ఫలాలు! ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం.
అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా.
అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 22)న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం
అన్నికార్యాల్లో విజయం, సౌఖ్యం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సాయం. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధువులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.
వృషభం
అధిక ప్రయాణాలు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగాల్లోఅవకాశాలు పెరుగుతాయి. అనవస డబ్బు ఖర్చుతో ఆందోళన. విదేశీయాన ప్రయత్నాలు సుగుమం. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు. ఎవరికీ హామీలుఇవ్వొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మిథునం
సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. మనోల్లాసం పొందుతారు. సజావుగా వృత్తి, వ్యాపారాలు. పట్టుదలతో కార్యాలు పూర్తి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు. బంధు మిత్రులకు సాయం చేస్తారు.

కర్కాటకం
వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి. అయోమయంగా కుటుంబ పరిస్థితులు, మానసిక ఆందోళన. ప్రతిపని ఆలస్యం. విమర్శలు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త.
సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలు. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఆందోళనకరంగా ఆర్థిక పరిస్థితి. నూతనకార్యాలకు దూరంగా ఉండాలి. అధిక ప్రయాణాలు. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతల నిర్వహణ. వ్యాపారాలు కొత్త పుంతలు. అనవసర ఖర్చులతో ఇబ్బందులు. వస్త్రా భరణాలు కొనుగోలు.
కన్య
ఆశాజనకంగా వ్యాపారాలు. ఓపికతో ఉండాలి. ఆవేశంవల్ల పనులు చెడిపోతాయి. కుటుంబసమేతంగా ఆలయాల సందర్శణ. తరచూ ప్రయాణాలు. అకాల భోజనం వల్ల అనారోగ్యం. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాలు విజయవంతం.

తుల
ఆశించిన దాని కన్నా ఆదాయం పెరిగే అవ కాశం. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు. బంధు మిత్రులతో విరోధం. స్త్రీల వళ్ల శతృబాధలు. ఒక విషయంతో మనస్తాపం. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు. పిల్లల విషయంలో పట్టుదల పనికిరాదు. పగ, ప్రతీకారాలు వదిలివేయాలి. ఉద్యోగం మారే సూచనలు
వృశ్చికం
సంతృప్తికరంగా వృత్తి జీవితం. గౌరవ మర్యాదల్లో లోపం ఉండదు. అనవసర వ్యయప్రయాసలు, వృధా ప్రయాణాలు ఎక్కువ. నిలకడగా వ్యాపారాలు. మానసిక ఆందోళనలు. బంధుమిత్రులతో స్నేహా పూర్వకంగా ఉండాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ప్రముఖులతో స్నేహ సంబంధాలు. ఇంటా బయటా ఒత్తిడి, శారీరకంగా బలహీనం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు
ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతృప్తికరంగా కుటుంబ పరిస్థితులు. కొన్ని విషయాల్లో ఓపికతో ఉండాలి. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయం, మిత్రులతో విరోధానికి దూరంగా ఉండాలి. అనవసర ధనవ్యయం, రుణప్రయత్నాలు ఎక్కువ. సాఫీగా వృత్తి, వ్యాపారాలు. అనుకూలంగా ఉద్యోగ వాతావరణం.

మకరం
వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి. ముఖ్యమైన సమాచారాలు అందుకుంటారు. ఆకస్మిక ధన యోగ. ప్రయత్నకార్యాల్లో విజయం. ఇంటా బయటా ఒత్తిడి. బంధు, మిత్రులతో కలయిక. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో ఉత్సాహం. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగ, పెళ్లి
ప్రయత్నాల్లో శుభవార్తలు
కుంభం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి . దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. మానసిక ఆనందం ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. శుభవార్తలు వింటారు. సులభంగా శుభకార్య ప్రయత్నాలు
మీనం
ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ. భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సానుకూలంగా ఆర్థిక వ్యవహారాలు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు, రుణప్రయత్నాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యంగా ఆత్మీయుల సహకారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram