Ramagundam Airport | రామగుండం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తొలి అడుగు
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.43 లక్షలు విడుదల చేసింది.

- ప్రీ ఫిజిబిలిటీ స్టడీకి రూ.40.34 లక్షలు విడుదల
విధాత : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రామగుండంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.43 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చెప్పారు. రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ఇది తొలి అడుగు అని ఆయన అన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతేరగాంవ్ మండలంలో 591 ఎకరాల భూమిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనపై ఈ స్టడీ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్టు కోసం రెండేళ్ల కల ఇప్పుడు సాకారం కానుందన్నారు. రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగితే ప్రజలకు, సింగరేణి సిబ్బందికి, విద్యార్థులకు, వ్యాపారులకు ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో గంటలకొద్దీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదని ఎంపీ చెప్పారు.