Girija Oak : ‘ఇది ఫేక్ అకౌంట్..డబ్బులు పంపకండి’.. వైరల్ నటి గిరిజా ఓక్ రిక్వెస్ట్

బ్లూ చీర లుక్‌తో వైరల్ అయిన గిరిజా ఓక్ పేరుతో కేటుగాళ్లు నకిలీ అకౌంట్లతో విరాళాలు సేకరిస్తుండటంపై ఆమె అప్రమత్తం చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Girija Oak : ‘ఇది ఫేక్ అకౌంట్..డబ్బులు పంపకండి’.. వైరల్ నటి గిరిజా ఓక్ రిక్వెస్ట్

విధాత, హైదరాబాద్ : మరాఠి, హిందీ నటి గిరిజా ఓక్ ఇటీవల దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ‘బ్లూ చీర లుక్’లో గిరిజా ఓక్ వైరల్ కావడంతో ఆమె పేరుతో కేటుగాళ్లు నకిలీ అకౌంట్లు సృష్టించి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజా వాటిపై స్పందించింది. తన పేరుతో విరాళాలు సేకరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు సంబంధించి స్క్రీన్ షాట్‌ను ఆమె షేర్ చేశారు. ‘ఇది ఫేక్ అకౌట్..దీనికి డబ్బులు పంపించకండి..జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నాకు డబ్బులు అవసరం ఉంటే నా అధికారిక అకౌంట్ నుంచి మాత్రమే విరాళాలు అడుగుతాను’ అని గిరిజా ఓక్ స్పష్టం చేసింది.

కాగా, నటి గిరిజా ఓక్ కు సంబంధించిన పీఆర్ టీమ్‌ పేరుతో ఆ నకిలీ అకౌంట్‌ ప్రజల్ని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌కు డబ్బులు పంపాలని కోరిందని సమాచారం. దీనిపై వెంటనే స్పందించిన నటి అభిమానులను అప్రమత్తం చేయడం విశేషం. ఆర్థిక లావాదేవీల విషయంలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌ అసలైన వాటిని చెక్ చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.

కాగా, అంతకుముందు గిరిజా ఓక్ ఫోటోలను ఏఐను ఉపయోగించి అశ్లీలంగా మార్చడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పోస్టులపై అవి “అశ్లీలమైనవి, అవమానకరమైనవి” అని తేల్చి చెప్పారు. అలాంటి కంటెంట్‌ తన 12 ఏళ్ల కొడుకుపై చూపించే ప్రభావం గురించి గిరిజ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యలన్నింటి మధ్యన కూడా అభిమానులు తనపై చూపుతున్న ప్రేమకు గిరిజా ఓక్ కృతజ్ఞతలు తెలిపారు. తమ సినిమాలు, సిరీస్‌లు, థియేటర్‌ పనిని మరింత మంది ప్రేక్షకులు చూసేలా ఈ గుర్తింపు ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానులు తప్పనిసరిగా తన అధికారిక, వెరిఫైడ్‌ అకౌంట్లను మాత్రమే ఫాలో కావాలని గిరిజా ఓక్ సూచించారు.