Minister Sitakka | బాలికలు ఉన్నత చదువులు చదవాలి : మంత్రి సీతక్క
ప్రతీ బాలిక ఉన్నత చదువులు చదవాలని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. బాలికలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ విద్యాలయాల ఏర్పాటు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.
విధాత, వరంగల్ ప్రతినిధి:
ప్రతీ బాలిక ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బాలికలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. సోమవారం ములుగు జిల్లా మాధవరావు పల్లిలో రూ.2 కోట్ల 30 లక్షల నిధులతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం తరగతి గదులు, ప్రయోగశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గతంలో బాలికలకు విద్య అవసరం లేదనే సనాత ధర్మం పాటిస్తూ వంటగదిలకే పరిమితం చేశారని, నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వివరించారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి విద్యా బోధన చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలు విద్యను బోధిస్తున్నారని తెలిపారు. తాను సైతం ప్రభుత్వ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించానని, ప్రతి బాలిక తమ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ఈ ఈ ఎడ్యుకేషన్ ఇంజనీర్ అరుణ్ కుమార్, డిఈఓ సిద్ధార్థ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram