పెరిగిన బంగారం ధరలు

గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ770 పెరిగి రూ.1,47,280కి చేరగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 1,35,000కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,45,00వద్ద స్థిరంగా నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 23, 2026, 10:18 am IST
Read Time: 4 mins
పెరిగిన బంగారం ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇరాన్ తో యుద్దానికి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరో 95బిలయన్ డాలర్లు(9లక్షల కోట్లు) బడ్జెట్ ను కేటాయింపులకు ఆమోదం తెలుపడంతో యుద్దం కొనసాగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అటు  ఇరాన్ సైతం అమెరికాపై భారీ దాడులు చేస్తామని హెచ్చరించిన క్రమంలో యుద్దం  కొనసాగక తప్పదన్న ఆందోళన మార్కెట్లను కలవరపెడుతుంది.

యుద్ద ఉద్రిక్తతల మధ్య  పెరిగిన క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా మార్కెట్లను అస్థిర పరుస్తున్నాయి. ఇదే క్రమంలో విలువైన లోహాలు బంగారం, వెండి ధరలు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.

గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ770 పెరిగి రూ .1,47,280కి చేరగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 1,35,000కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,45,00వద్ద స్థిరంగా నిలిచింది.

భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పైకి..

అమెరికా బాండ్ దిగుబడులు పెరగడం, బలమైన అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావంతో పసిడి ధరలు తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ విలువైన లోహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల నుండి లభిస్తున్న అపారమైన డిమాండ్ ఆసరాతో ధరల పతనాన్ని తట్టుకుని నిలబడుతుందని ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ స్పష్టం చేసింది.
ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో కాగితపు కరెన్సీల కంటే బంగారం వైపే కేంద్ర బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి.

స్వల్పకాలికంగా మార్కెట్‌లో కొంత ప్రతికూలత, ధ‌ర‌ల అస్థిరత కనిపించినప్పటికీ.. అధికారిక రంగం నుండి అందుతున్న నిరంతర మద్దతు కారణంగా బంగారం ధరల్లో భారీ లేదా సుదీర్ఘమైన పతనం సంభవించే అవకాశం లేదని బ్యాంక్ విశ్లేషించింది. భవిష్యత్తులో ధరలు భారీగా పెరగడమే కాని తగ్గడం అనేది జరగదని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేస్తోంది. సామాన్యులు బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి రావొచ్చని తెలిపింది.