Metro | మెట్రో ప్రయాణికులకు అలెర్ట్.. రైలు వేళల్లో మార్పులు!
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి మెట్రో కొత్త టైమ్ టేబుల్‌అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
విధాత, హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి మెట్రో కొత్త టైమ్ టేబుల్‌అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను కొత్త సమయాల ప్రకారం సర్దుబాటు చేసుకోవాలని మెట్రో అధికారులు కోరారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తర్వాత నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులు మెట్రో సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాక, ప్రజా రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారిందని అధికారులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram