Bengaluru Murder Case | ‘నీ కోసమే నా భార్యను చంపేశా’.. ఫోన్ పేలో మహిళలకు వైద్యుడి మెసేజ్!

కర్ణాటకలో సంచలనం రేపుతున్న వైద్య దంపతుల హత్య కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ మహేంద్ర రెడ్డి తన భార్య డాక్టర్‌ కృతికా హత్య చేశాడు. తరువాత ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా భార్యను చంపాను’ అని మెసేజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Bengaluru Murder Case | ‘నీ కోసమే నా భార్యను చంపేశా’.. ఫోన్ పేలో మహిళలకు వైద్యుడి మెసేజ్!

బెంగళూరు :
కర్ణాటకలో సంచలనం రేపుతున్న వైద్య దంపతుల హత్య కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ మహేంద్ర రెడ్డి తన భార్య డాక్టర్‌ కృతికా హత్య చేశాడు. తరువాత ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా భార్యను చంపాను’ అని మెసేజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ మేస్‌జ్ లను మహేంద్ర రెడ్డి ఫోన్ పే యాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు గతంలోనే మహీంద్ర తనను పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె తిరస్కరించినట్లు సమచారం. కాగా, భార్య మరణం తరువాత పాత పరిచయాలు మళ్లీ కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, మహేంద్రను భార్య హత్యకేసులో అక్టోబర్ లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొపోఫాల్ అనే మత్తుమందు ఇచ్చి మహేంద్ర తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ విక్టోరియా ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేసేవారు. 2024 మే 26న పెళ్లి చేసుకోగా ఏడాది గడవకముందే విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య సమస్యల కారణంగా కృతికా మరతహళ్లిలోని తన తండ్రి నివాసంలో ఉంటున్న సమయంలో మహేంద్ర రెండు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇచ్చి.. అవి చికిత్సలో భాగమని చెప్పాడు. కానీ 2025 ఏప్రిల్‌ 23న కృతికా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయింది.

మొదట ఇది సహజ మరణంగా పోలీసులు భావించారు. కానీ, కృతికా సోదరి నికితా అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంచించడంతో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. ఆరు నెలల తరువాత వచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికలో కృతికా శరీరంలోని పలు అవయవాల్లో ప్రొపోఫాల్‌ డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసును హత్యగా గుర్తించారు. దీంతో మహేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో పోలీసులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.