Madanapalle | అధ్యాపకురాలి హత్య కేసు.. కీలక సూత్రధారి అయేషా అరెస్టు

Madanapalle | విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన అధ్యాపకురాలు రుక్సాన హత్యకేసులో కీలక సూత్రధారి అయేషాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అయేషా అరెస్టుతో నిందితుల సంఖ్య 11కు చేరింది. మదనపల్లి డీఎస్పీ కేశప్ప, 2టౌన్ సీఐ మురళీకృష్ణ నిందితురాలి అరెస్టు వివరాలు మీడియాకు వెల్లడించారు. స్థానిక బీకే పల్లికి చెందిన ఖదీర్ అహ్మద్ తన మొదటి భార్య రుక్సానాకు పిల్లలు పుట్టలేదని ఈ నెల 3న అప్పారావుతో టలో ఉండే […]

Madanapalle | అధ్యాపకురాలి హత్య కేసు.. కీలక సూత్రధారి అయేషా అరెస్టు

Madanapalle |

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన అధ్యాపకురాలు రుక్సాన హత్యకేసులో కీలక సూత్రధారి అయేషాను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

అయేషా అరెస్టుతో నిందితుల సంఖ్య 11కు చేరింది. మదనపల్లి డీఎస్పీ కేశప్ప, 2టౌన్ సీఐ మురళీకృష్ణ నిందితురాలి అరెస్టు వివరాలు మీడియాకు వెల్లడించారు.

స్థానిక బీకే పల్లికి చెందిన ఖదీర్ అహ్మద్ తన మొదటి భార్య రుక్సానాకు పిల్లలు పుట్టలేదని ఈ నెల 3న అప్పారావుతో టలో ఉండే అయేషాను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య గొడవలు అధికమయ్యాయి.

ఈ క్రమంలో అయేషా పథకం ప్రకారం తన బంధువులతో రుక్సానాను హత్య చేయించింది. కేసులో ప్రధాన సూత్రధారి అయేషా అరెస్టుతో నిందితుల సంఖ్య 11 కు చేరిందని, మరో నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.