IRCTC Best Package | రూ.11,370కే మైసూర్, సోమనాథ్ పూర్, బేలూర్ యాత్ర
గందపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూరు పట్టణానికి శాండిల్ వుడ్ అనే పేరు వచ్చింది. భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాల్లో మైసూరు కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్ర చరిత్రకు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మైసూరు నిలుస్తుంది.
IRCTC Best Package | గందపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూరు పట్టణానికి శాండిల్ వుడ్ అనే పేరు వచ్చింది. భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాల్లో మైసూరు కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్ర చరిత్రకు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మైసూరు నిలుస్తుంది. అసలు ఈ ప్రాంతానికి మైసూరు అనే పేరు ఎలా వచ్చిందంటే.. కన్నడ భాషలోని మహిషా, మహిసురుడు అనే పదాల నుంచి మైసూరు పేరు పుట్టింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు, కోటలు ఉన్నాయి. వీటిని దర్శించుకునేందుకు IRCTC రూ.11,370కే ‘మెమోరీస్ ఆఫ్ మైసూర్’ అనే ప్యాకేజీ తీసుకువచ్చింది. నవంబర్ 26న ప్రారంభం కానున్న ఈ యాత్ర పూర్తిగా 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగుతుంది.
యాత్ర పూర్తి వివరాలు: మొదటి రోజు అంటే నవంబర్ 26న కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రాత్రి 07:05 గంటలకు ట్రైన్ నెంబర్: 12785 కాచిగూడ-మైసూర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు మైసూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకు వెళ్తారు. ఫ్రెష్ అయ్యాక టిప్పు సమ్మర్ ప్యాలెస్, శ్రీరంగపట్న చూస్తారు. సాయంకాలం మైసూర్ ప్యాలెస్ లైట్, సౌండ్ షో చూడవచ్చు. రాత్రికి హోటల్‌లోనే భోజనం చేసి అక్కడే నిద్రిస్తారు.
మూడవ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని నంజనగూడు ఆలయానికి వెళ్తారు. ఈ ఆలయం మీరు బస చేసే హోటల్ నుంచి 25 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడ దర్శనం పూర్తి చేసుకుని సోమ్‌నాథ్‌పుర వెళ్తారు. అక్కడి నుంచి తలకడు చూసుకుని అక్కడి నుంచి మైసూరు చేరుకుంటారు. రాత్రికి హోటల్‌లోనే భోజనం, బస చేయాల్సి ఉంటుంది. నాలుగవ రోజు ఉదయం మళ్లీ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని 150 కి.మీ దూరంలో ఉన్న బేలూర్ వెళ్తారు. అక్కడ చెన్నకేశవ ఆలయం దర్శించుకుని అక్కడి నుంచి హళేబీడు హొయసలేశ్వరా ఆలయం దర్శించుకుంటారు. ఈ ఆలయం 12వ దశాబ్దంలో నిర్మించారు. ఇక్కడ శివుడికి ఎంతో మహిమ ఉంటుందని భావిస్తారు. రాత్రికి తిరిగి మైసూర్ హోటల్‌కు చేరుకుంటారు.
ఇక ఐదవ రోజు అల్పహారం ఆరగించి హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి చాముండి హిల్స్ 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ చాముండేశ్వరి ఆలయం ఉన్నందున ఆ కొండకు చాముండి హిల్స్ అనే పేరు వచ్చింది. ఈ కొండను దర్శించుకున్నాక, చివరగా మైసూర్ ప్యాలెస్ చేరుకుంటారు. ఆ తర్వాత మైసూర్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 03:15 గంటలకు ట్రైన్ నెంబర్ : 12786 ఎక్కి రాత్రంతా ప్రయాణం చేస్తారు. ఇక 6వ రోజు ఉదయం 05:40 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.
టికెట్ ధరలు: ఈ యాత్రలో కంఫర్ట్, స్టాండర్డ్ అనే స్లాట్స్ ఉంటాయి. కంఫర్ట్ అయితే రైల్లో 3ఏసీ టికెట్. హోటల్‌లో ఏసీ గదులు ఉంటాయి. స్టాండర్డ్ అయితే రైల్లో స్లీపర్, హోటల్‌లో నాన్ ఏసీ గదులు ఉంటాయి. ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్లాలి అనుకుంటే కంఫర్ట్‌లో రూ.32710, స్టాండర్డ్ అయితే రూ.30690 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ.18820, స్టాండర్డ్ రూ.16800 చొప్పున చెల్లించాలి. అదే ముగ్గురు కలిసి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ.16050, స్టాండర్డ్ రూ.14030 చొప్పున కట్టాలి.
ఒక వేళ మీరు నలుగురు నుంచి ఆరుగురు కలిసి వెళ్తే ఇద్దరు చొప్పున ఒక్కో గది తీసుకోవచ్చు లేదంటే ముగ్గురు కలిసి ఒక్కో గదిని తీసుకోవచ్చు. ఇలా ఇద్దరు కలిసి కంఫర్ట్‌లో గది తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.15230, స్టాండర్డ్ అయితే రూ. 13210 చొప్పున చెల్లించాలి. అదే ముగ్గురు కలిసి ఒక గది తీసుకుంటే ఒక్కొక్కరు కంఫర్ట్ రూ.13390, స్టాండర్డ్ రూ.11370 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉంటే వారికి విత్ బెడ్‌తో అయితే కంఫర్ట్‌లో రూ.10200, వితౌట్ బెడ్ అయితే రూ.7970, స్టాండర్డ్ అయితే విత్ బెడ్ రూ.8180, వితౌట్ బెడ్ రూ.5950 చొప్పున చెల్లించాలి.
గమనిక: మరింత సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్ సందర్శించగలరు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram