దారుణం.. ఫోన్ పే పని చేయడం లేదని..
మధ్యప్రదేశ్ – జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఫోన్ పే పనిచేయడంలేదని ఓ సమోసా వ్యాపారి ప్రయాణికుడి వద్ద బలవంతంగా వాచ్ లాక్కున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది
విధాత: మధ్యప్రదేశ్ – జబల్ పూర్ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. ఫోన్ పే పనిచేయడంలేదని ఓ సమోసా వ్యాపారి ప్రయాణికుడి వద్ద బలవంతంగా వాచ్ లాక్కున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రయాణికుడు సమోసా తీసుకున్నాడు.. ఈ క్రమంలో ఫోన్ పే పనిచేయలేదు, రైలు కదలిపోతుండటంతో.. సమోసాలాను తిరిగి ఇచ్చాడు.
దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి.. సదరు ప్రయాణికుడి కాలర్ పట్టుకుని, డబ్బు కట్టమని బలవంతం చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని ప్రయాణికుడు అతని వద్ద ఉన్న వాచ్‌ను సమోసా వ్యాపారికి ఇవ్వడంతో అతను వదిలేశాడు. ఈ ఉధంతమంతా చిత్రీకరించిన మరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram