విధాత, హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు కే.వెంకట్రామ్ రెడ్డిని ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేయడం కలకలం రేపింది. కేవీ రెడ్డి అరెస్టును అడ్డుకున్న ఆయన భార్య పట్ల ఏపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించి ఈడ్చిపడేయడం వివాదస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్ధరాత్రి సమయంలో కేవీరెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి ఓ ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లిన పోలీసులు ఆయనను ప్రస్తుతం ఎక్కడ ఉంచారు? ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు? అనే విషయాలపై కుటుంబ సభ్యులకు సైతం సమాచారం తెలుపకపోవడం ఆందోళనకరంగా మారింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసుల బృందం మఫ్టీలో, ప్రైవేట్ వాహనంలో తెలంగాణలోని కేవీఆర్ నివాసానికి మంగళవారం అర్థరాత్రి వెళ్లింది. కేవీఆర్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన భార్య పోలీసులను అడ్డుకుంది. మాకు వారెంట్ ఉందని చెబుతూ.. ఆమెను ఈడ్చిపడేసి పిల్లల ముందే బలవంతంగా తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవీ రెడ్డిని ఏపీకి తీసుకు వెళ్లే ముందు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏపీ పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం కేవీ రెడ్డిని ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది. కేవీ రెడ్డి ఆచూకీపై కుటుంబ సభ్యులు, సహచర జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవీఆర్‌ను ఎక్కడ ఉంచారు? ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు? అనే వివరాలను వెంటనే వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఏపీ పోలీసులపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో జర్నలిస్ట్ కేవీ రెడ్డి భార్య ఫిర్యాదు చేశారు. సివిల్ డ్రెసులో వచ్చిన ఏపీ పోలీసులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య దూమారం రేపుతున్న జర్నలిస్టు అరెస్టు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ రాజకీయంగా కూడా దూమారం రేపుతుంది. ఏపీ మంత్రి నారా లోకేష్‌పై కేవీఆర్ చేసిన రాజకీయ విశ్లేషణకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 152, 196, 353 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే కేసులో ఈ ఏడాది మార్చి 11న కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చి కేవీఆర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కేసు విచారణకు హాజరు కావాలని.. కేసు నమోదు చేసిన టైంలోనే నోటీసులు జారీ చేశారు. తాజాగా విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు మఫ్టీలో వచ్చి కేవీ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇటీవల ఏపీ పోలీసులు విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు పై కేసులు పెట్టడం, అరెస్టుకు ప్రయత్నించడం, ఆ తర్వాతా మరో విశ్లేషకులు తెలకపల్లి రవితో సైతం ఏపీ జనసేన నాయకులు సవాళ్లకు దిగడం, ఇడుపు కాయితం సినిమా టైటిల్ పై వివాదం వంటి వరుస ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలను రగిలించేలా ఉండటం పట్ల తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు
కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు 3 నెలల క్రితం కేసు నమోదు
విచారణకు హాజరు కావాలని.. కేసు నమోదు చేసిన టైంలోనే నోటీసులు జారీ చేసిన పోలీసులు
ఈరోజు రాత్రి వేళ… https://t.co/fNFEVGWsKN pic.twitter.com/edrbvoAnUX
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 30, 2026
